twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ 2 డేస్ కలెక్షన్: నైజాంలో వసూళ్ల హవా.. ఆంధ్రాలో

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్లకుపైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం రెండు రోజు సైతం మంచి ఫలితాలు రాబట్టింది. అయితే తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు దాదాపు సగం మేర డ్రాప్ అయ్యాయి.

    ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాలతో కంపేర్ చేస్తే నైజాంలో వసూళ్లు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. ఇక్కడ తొలి రోజు రూ. 6 కోట్లకు పైగా షేర్ వసూలవ్వగా... రెండో రోజైన శుక్రవారం 3 కోట్లకుపైగా వసూలు చేసి టోటల్ షేర్ రూ. 10 కోట్లకు చేరువైంది. అయితే ఇతర ఏరియాల్లో కలెక్షన్స్ నిరాశ పరిచే విధంగా ఉన్నాయి.

    మహర్షి చిత్రం నైజాంలో 2వ రోజు రూ. 3,28,91,833 షేర్ వసూలైంది. దీంతో టోటల్ షేర్ 9,66,78,552 కోట్లకు చేరుకుంది. అయితే శని, ఆది వారాలు వీకెండ్ కావడం వల్ల వసూళ్లు మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    Maharshi 2nd Day Collection details

    గుంటూరులో శుక్రవారం వసూళ్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు రూ. 4.4 కోట్ల షేర్ వసూలవ్వగా.. రెండో రోజు కేవలం 49 లక్షలు మాత్రమే రాబట్టింది. టోటల్ షేర్ రూ. 4.89 కోట్లకు రీచ్ అయింది. ఇంత భారీ మొత్తంలో వసూళ్లు డ్రాప్ అవ్వడం ఆందోళన కలిగించే విషయమే.

    నా కెరీర్లోనే బిగ్గెస్ట్: 'మహర్షి' విజయంపై మహేష్ బాబు భావోద్వేగంనా కెరీర్లోనే బిగ్గెస్ట్: 'మహర్షి' విజయంపై మహేష్ బాబు భావోద్వేగం

    ఈస్ట్ గోదావరిలో సైతం పరిస్థితి అలాగే ఉంది. మొదటి రోజుతో పోలిస్తే.. రెండో రోజు వసూళ్లు నిరాశ పరిచే విధంగా ఉన్నాయి. ఇక్కడ తొలి రోజు 3.2 కోట్లు కోట్లు వసూలవ్వగా... రెండో రోజు 59.8 లక్షలు మాత్రమే రాబట్టింది. 2 డేస్ టోటల్ షేర్ 3,79,93,848.

    Maharshi 2nd Day Collection details

    వెస్ట్ గోదావరిలో 'మహర్షి' చిత్రం రూ. 2.47 కోట్లు రాబట్టగా... రెండో రోజు కేవలం 44 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీంతో టోటల్ షేర్ 2.90 కోట్లకు రీచ్ అయింది. అయితే శుక్రవారం ఇంత భారీ మొత్తంలో కలెక్షన్స్ పడిపోవడానికి కారణం మిక్డ్స్ టాక్ రావడమే అని భావిస్తున్నారు.

    కృష్ణా జిల్లాలో సైతం రెండో రోజు నిరాశ జనకమైన ఫలితాలే రాబట్టింది. ఇక్కడ తొలి రోజు రూ. 1.39 కోట్లు రాబట్టగా... రెండో రోజు 73 లక్షలు వసూలు చేసింది. టోటల్ షేర్ రూ. 2.12 కోట్లకు చేరువైంది. ఇక నెల్లూరులో తొలి రోజు రూ. 1 కోటి వసూలు చేయగా రెండో రోజు రూ. 24 లక్షలు రాబట్టింది.

    English summary
    Maharshi 2nd Day Collection details. The film, which collected Rs 6.38 crore share on day 1, went on to collect a cool Rs 3.30 crore on day 2, taking its 2-day total Nizam share to Rs 9.68 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X