మహర్షి 6 రోజుల వసూళ్లు.. మళ్లీ కాలర్ ఎగిరేసిన మహేష్.. తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల దిశగా

Recommended Video

Mahesh Babu's Maharshi Creates New Record In His Career || Filmibeat Telugu

సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా సత్తా చాటుతున్నది. నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు సాధించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టేందుకు పరుగులు పెడుతున్నది. గత 6 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా వివరాల్లోకి వెళితే..

నైజాంలో వసూళ్లు

నైజాంలో వసూళ్లు

నైజాంలో మహర్షి చిత్రం ఘనంగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం హక్కులు రూ.24 కోట్లు పలుకగా, ఇప్పటి వరకు 18.56 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 25 శాతం రికవరీ చేయాల్సి ఉంది. ఇక సీడెడ్‌లో ఈ చిత్రం హక్కులు రూ.9.60 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లో రూ.7 కోట్లు సాధించింది.

ఆంధ్రాలో

ఆంధ్రాలో

ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రాంతాల వారీగా కలెక్షన్లు బారీగానే ఉన్నాయి. వైజాగ్‌లో ఇప్పటి వరకు రూ. 6.66 కోట్లు, పశ్చిమ గోదావరి సుమారు రూ.4 కోట్లు, తూర్పు గోదావరిలో రూ.4 కోట్ల వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో రూ.3.99 కోట్లు, గుంటూరులో రూ.6.12 కోట్లు, నెల్లూరులో రూ. 2.90 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణ హక్కులను రూ.76 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ.53.45 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను పరిశీలిస్తే. తొలి రోజున రూ.24.68 కోట్లు, రెండో రోజున రూ.8.01 కోట్లు, మూడో రోజున రూ.8.44 కోట్లు, ఐదో రోజున రూ. 4.9 కోట్లు ఆరో రోజున రూ.3.44 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా రూ.75 కోట్లకుపైగా గ్రాస్ రూ.56.66 కోట్లు నికర వసూళ్లను రాబట్టడం గమనార్హం. రానున్న రోజుల్లో ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసే అవకాశాలు లేకపోలేదు.

అమెరికాలో అంతంతగానే

అమెరికాలో అంతంతగానే

యూఎస్ బాక్సాఫీస్ వద్ద మహర్షి పెద్దగా సందడి చేయలేకపోతున్నది. గత ఆరు రోజుల్లో మోస్తారు వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం గత గురువారం 516k డార్లు, శుక్రవారం 234k డాలర్లు, శనివారం 299k డాలర్లు, ఆధివారం 193k డాలర్లు, సోమవారం 31k డాలర్లు, మంగళవారం 78k డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు సమాచారం.

మళ్లీ కాలర్ ఎగిరేసిన మహేష్

మళ్లీ కాలర్ ఎగిరేసిన మహేష్

మహర్షి నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్న నేపథ్యంలో వసూళ్లకు మరింత ఊపు తెచ్చే ప్రయత్నం మహేష్ బాబు చేస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా మహేష్ బుధవారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌కు వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడారు. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో లాంటి బ్లాక్ బస్టర్లను ఈ థియేటర్ ఇచ్చిందని మహేస్ చెప్పారు. మహర్షి నా జీవితంలో కాలర్ ఎగురేసుకొనే చిత్రమని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X