Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మహర్షి’ 10 డేస్ కలెక్షన్ రిపోర్ట్: మహేష్ మూవీ తిరుగులేని ఆధిపత్యం!
మహేష్ బాబు 25వ చిత్రం 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్ల పంట పండిస్తోంది. మే 9న రిలీజైన ఈ మూవీ శనివారంతో విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ. 90 కోట్లకు చేరువైంది. త్వరలోనే రూ. 100 కోట్ల మార్క్ అందుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
సినిమాకు డబుల్ పాజిటివ్ టాక్ రావడంతో పాటు... సూపర్ స్టార్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడం, సమ్మర్ హాలిడేస్ కలిసి రావడం, బాక్సాఫీస్ బరిలో ఇతర చిత్రాలేవీ లేక పోవడంతో మార్కెట్లో 'మహర్షి'కి ఎదురు లేకుండా పోయింది. మహేష్ బాబు కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.
ఇప్పటి వరకు వసూలైన మొత్తం ఎంత?
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘మహర్షి' గడిచిన 10 రోజుల్లో రూ. 88.39 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆదివారంతో ఈ మొత్తం రూ. 90 కోట్లు దాటనుంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఏరియాల్లో ఆదివారం థియేటర్లు హౌస్ ఫుల్ వసూళ్లతో కళకళలాడాయి.
ఆ రెండు ఏరియాల్లో కలెక్షన్లు స్లో...
‘మహర్షి' చిత్రం నైజాం ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఇప్పటికీ ఈ చిత్రం ఇక్కడ 10 రోజుల్లో 98 శాతం రికవరీ సాధించింది. అయితే సీడెడ్, యూఎస్ఏలో మాత్రం ఈ మూవీ వసూళ్లు కాస్త స్లోగా ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది.
ఏరియా వైజ్ షేర్
నైజాం రూ. 23.50 కోట్లు, సీడెడ్ రూ. 8.09 కోట్లు, గుంటూరు రూ. 7.05 కోట్లు, కృష్ణ రూ. 4.63 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 6.01 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.74 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 8.52 కోట్లు, నెల్లూరు రూ. 2.28 కోట్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 76 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వగా... ఇప్పటి వరకు రూ. 64.82 కోట్లు రాబట్టింది.
అక్కడ లాభాల బాటలో...
కర్నాటక, రెస్టాఫ్ ఇండియా రాష్ట్రాల్లో ‘మహర్షి' చిత్రం ఇప్పటికే లాభాల బాట పట్టింది. కర్నాటక రైట్స్ రూ. 8.30 కోట్లు అమ్ముడవ్వగా... ఇప్పటి వరకు రూ. 9.22 కోట్లు రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 1.70 కోట్లకు అమ్మగా... రూ. 2.55 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ ఏరియా రైట్స్ రూ. 14 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 11.80 కోట్లు వసూలు చేసింది.
మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.