twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి నాన్ బాహుబలి రికార్డు.. 200 కోట్ల క్లబ్‌లోకి మరోసారి మహేష్!

    |

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇంకా కాసులు పంట పండిస్తున్నది. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అరుదైన రికార్డుకు చేరువైంది. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరేందుకు మహర్షి రెడీ అయింది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన పూజాహెగ్డే, అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రం మొదట మిశ్రమ స్పందనను ఎదుర్కొన్నప్పటికీ.. ఆ టాక్‌ను పాజిటివ్‌గా మార్చుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. తాజాగా రిలీజైన NGK, ఫలక్‌నుమా దాస్‌ను ఎదురించి ఈ సినిమా గత 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

    మిక్స్‌డ్ టాక్‌ను ఎదురించడంతో

    మిక్స్‌డ్ టాక్‌ను ఎదురించడంతో

    మహర్షి సినిమాకు ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ పోరు చాలా తేలికైంది. దాంతో భారీ వసూళ్లు సాధించడానికి లక్ష్యం సులభమైంది. ఫ్యాన్స్ అండగా నిలవడం, అంతేకాకుండా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడం, అలాగే అన్ని వర్గాలు సానుకూలంగా స్పందించడంతో మహర్షిపై క్రేజ్ పెరిగింది.

    రూ.200 కోట్ల వసూళ్లతో

    రూ.200 కోట్ల వసూళ్లతో

    గత 27 రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌ను దాటేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 94.60 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటికే ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్‌ను సాధించింది. రానున్న కొద్ది రోజుల్లో ఈ సినిమా వసూళ్లకు తెరపడే అవకాశం ఉంది.

    వైరల్ అవుతున్న స్టోరీ: మహేష్ బాబుకు రష్మిక మందన్న ఫ్యామిలీ టార్చర్?వైరల్ అవుతున్న స్టోరీ: మహేష్ బాబుకు రష్మిక మందన్న ఫ్యామిలీ టార్చర్?

    నైజాంలో కలెక్షన్ల దుమారం

    నైజాంలో కలెక్షన్ల దుమారం

    నైజాంలో మహర్షి చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, సుమారు రూ.30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇది నాన్ బాహుబలి రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఆంధ్రా, తెలంగాణలో 72 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు సుమారు 75 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

     సీడెడ్‌లో నిరాశజనకంగా

    సీడెడ్‌లో నిరాశజనకంగా

    సీడెడ్‌లో ఈ సినిమా వసూళ్లు నిరాశజనకంగానే ఉన్నాయి. 12 కోట్ల బిజినెస్ జరుగగా ఇప్పటి వరకు సుమారు 10 కోట్లు రాబట్టినట్టు సమాచారం. గుంటూరులో ఈ చిత్రం 8 కోట్లు, కృష్ణాలో 5.31 కోట్లు, పశ్చిమ, తూర్పు గోదావరిలో కలిపి 12 కోట్లకుపైగా, నెల్లూరులో సుమారు 3 కోట్లు వసూలు చేసిందని సమాచారం.

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    ఓవర్సీస్‌ మార్కెట్‌లో

    ఇక ఆంధ్రా, తెలంగాణేతర ప్రాంతాలను పరిశీలిస్తే.. కర్ణాటకలో ఈ చిత్రం సుమారు 11 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా, ఓవర్సీస్‌లో రూ.11 కోట్ల మేరకు రాబట్టినట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ చిత్రం 2 మిలియన్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం 1.8 మిలియన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Maharshi continues to perform pretty well at the box office. The Mahesh Babu movie is set to complete the fourth week of run in the theatres. Maharshi had enjoyed yet another good weekend at the box office with the film offering a very tight competition to the other releases of this week such as NGK and Falakunama Das.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X