‘మహర్షి’ యూఎస్ఏ కలెక్షన్స్...ఎట్టకేలకు 1 మిలియన్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన సోషల్ థ్రిల్లర్ 'మహర్షి' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 1 మిలియన్ మార్క్ అందుకుంది. ఇండియాకంటే ఒక రోజు ముందు ప్రీమియర్ షోలతో ఇక్కడ 'మహర్షి' బాక్సాఫీస్ ప్రస్థానం మొదలైంది. 2500లకుపైగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో గ్రాండ్‌గా విడుదలైంది.
తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని విధంగా, బాహుబలి లాంటి భారీ చిత్రాలను సైతం మించిపోయేలా ప్రీమియర్ షోలు వేయడంతో ఓపెనింగ్స్ సంచలన స్థాయిలో ఉంటాయని అంచనా వేశారు. అయితే అందరి ఎక్స్‌పెక్టేషన్స్ తారుమారు అయ్యాయి. ప్రీమియర్ షోల యూఎస్ఏలో కేవలం హాఫ్ మిలియన్ మాత్రమే వసూలైంది.

ఎట్టకేలకు శనివారం 'మహర్షి' 1 మిలియన్ మార్కు అందుకుంది. శుక్రవారం చివరి షో వరకే ఈ మార్కు అందుకుంటుందని అంచనా వేసనా... కొద్దిపాటి తేడాతో మిస్సయింది. వసూళ్ల వివరాలు పరిశీలిస్తే బుధవారం ప్రీమియర్ షోల ద్వారా $516k, గురువారం 176k, శుక్రవారం 230k, శనివారం 100k+ వసూలు చేసింది.
ఆదివారం హాలిడే కావడంతో ఈ రోజు మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని, దీంతో ఫస్ట్ వీకెండ్ 1.5 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా 'మహర్షి' మూవీ యూఎస్ఏ ఓపెనింగ్స్ ఊహించిన స్థాయిలో లేవని చెప్పక తప్పదు.
యూఎస్ఏలో పరిస్థితి అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో సినిమా ఫస్ట్ వీకెంట్ వసూళ్ల పరంగా దూసుకెళుతోంది తొలి రెండు రోజుల్లోనే ఇక్కడ రూ. 30 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది.
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











