twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవిని బీట్ చేయబోతున్న మహేష్ బాబు... చెర్రీని అందుకునే ఛాన్స్ లేదు!

    |

    Recommended Video

    Maharshi To Beat Khaidi No 150 All Time Record || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం మిక్డ్స్ టాక్, యావరేజ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. సమ్మర్ హాలిడేస్ ఈ చిత్రానికి బాగా కలిసొచ్చాయి. ప్రస్తుతం 5వ వారంలో అడుగు పెట్టిన ఈ మూవీ రూ. 100 కోట్లుపైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది.

    ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో రూ. 100 కోట్లకు పైగా షేర్ సాధించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. తొలిసారిగా 'మహర్షి' మూవీతో సూపర్ స్టార్ ఈ ఫీట్ సాధించగలిగారు. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండటం గమనార్హం.

    చిరంజీవి రికార్డ్ బద్దలు కొట్టే దిశగా..

    చిరంజీవి రికార్డ్ బద్దలు కొట్టే దిశగా..

    మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం. 150' సినిమా ద్వారా నెలకొల్పిన రూ. 102 కోట్ల రికార్డుకు మహేష్ బాబు ‘మహర్షి' చేరువైంది. త్వరలోనే మెగా రికార్డ్ బద్దలవ్వడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    చెర్రీని అందుకే ఛాన్స్ అయితే లేదు!

    చెర్రీని అందుకే ఛాన్స్ అయితే లేదు!

    రూ. 100 కోట్ల షేర్ క్రాస్ అవ్వడం ద్వారా ప్రస్తుతం ‘మహర్షి' టాప్ షేర్ వసూలు చేసిన టాలీవుడ్ చిత్రాల్లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. రేపో మాపో ‘ఖైదీ నెం.150' రికార్డును బద్దలు కొట్టిన 4వ స్థానంలోకి ఎగబాకనుంది. అయితే 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ రంగస్థలం(రూ. 120 కోట్ల షేర్) రికార్డును దాటే ఛాన్స్ అయితే లేదు. మొదటి రెండు స్థానాల్లో బాహుబలి 2, బాహుబలి ఉన్న సంగతి తెలిసిందే.

    నైజాంలో సంచలనం

    నైజాంలో సంచలనం

    అయితే నైజాంలో మాత్రం ‘మహర్షి' చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఈ మూవీ రూ. 30 కోట్లకుపైగా వసూలు చేయడం ద్వారా ... బాహుబలి 2, బాహుబలి తర్వాత థర్డ్ హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.

    లాభాలు వచ్చిన ఏరియాలు

    లాభాలు వచ్చిన ఏరియాలు

    నైజాంలో ఈ చిత్రం 22 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్(ఓన్ రిలీజ్) జరిగితే రూ. 30 కోట్ల మేర షేర్ రాబట్టి అత్యధిక లాభాలు సాధించింది. ఉత్తరాంధ్ర ఏరియాలో రూ. 9.10 కోట్లకుగాను రూ. 10.60 కోట్లు రాబట్టింది. గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కర్నాటక, తమిళనాడు, నార్త్ ఇండియా పెద్దగా లాభాలు లేకుండా కాస్త అటు ఇటుగా పెట్టుబడి రికవరీ అయినట్లు తెలుస్తోంది.

    ఇక్కడ నష్టాలే...

    ఇక్కడ నష్టాలే...

    సీడెడ్ ఏరియాలో థియేట్రికల్ రైట్స్ దాదాపు 12 కోట్లకు అమ్మారు. ఇక్కడ రూ. 2 కోట్ల మేర రికవరీ అవ్వాల్సి ఉంది. ఓవర్సీస్ మార్కెట్లోనూ దాదాపు 2 కోట్ల నష్టం ఏర్పడింది. నెల్లూరు ఏరియాలో డిస్ట్రిబ్యూటర్ రూ. 3 కోట్ల పెట్టుబడి పెట్టగా ఇంకా రూ. 30 లక్షలు రికవరీ అవ్వాల్సి ఉందని టాక్.

    మహర్షి

    మహర్షి

    ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    Mahesh Babu’s Maharshi in its fifth week’s run has crossed Rs 101 Cr mark worldwide. The film is short of crossing Megastar Chiranjeevi’s “Khaidi No 150” lifetime collections Rs. 102 cr record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X