twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ 5 డేస్ కలెక్షన్ రిపోర్ట్: మండే టెస్ట్ పాసైనట్లేనా?

    |

    Recommended Video

    Maharshi 5 Days Box-Office Collection Report || Filmibeat Telugu

    మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'మహర్షి' బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. సూపర్ స్టార్ కెరీర్లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 49 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో హ్యాపీ మూడ్ క్రియేట్ చేసింది.

    సెలవు దినాలు కావడంతో తొలి వారాంతం వసూళ్లు సంతృప్తికర స్థాయిలో ఉండటం సహజమే. అయితే సోమవారం నుంచి సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుందని, ఈ రోజు టెస్ట్ పాసైతే 'మహర్షి'కి తిరుగు ఉండదు అనేది విశ్లేషకుల వాదన. మరి 'మహర్షి' సోమవారం వసూళ్ల పరంగా టెస్ట్ పాసైందా? తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఓ లుక్కేద్దాం..

    నైజాం ఏరియాలో 5వ రోజు కలెక్షన్

    నైజాం ఏరియాలో 5వ రోజు కలెక్షన్

    నైజాం ఏరియాలో ‘మహర్షి' మూవీ ముందు నుంచి అదరగొడుతోంది. తొలి 4 రోజుల్లో రూ. 16.61 కోట్ల షేర్ వసూలు చేసింది. 5వ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. సోమవారం రూ. 2.31 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో టోటల్ షేర్ 18.92 కోట్లకు రీచ్ అయింది. ఈ ఏరియా రైట్స్ రూ. 22 కోట్లకు అమ్మారు. తొలివారం పూర్తయ్యే సమయానికి పెట్టుబడి మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంది.

    కృష్ణ జిల్లాలో....

    కృష్ణ జిల్లాలో....

    కృష్ణ జిల్లాలో సైతం ‘మహర్షి' సంతృప్తికర వాసూళ్లు సాధిస్తోంది. ఇక్కడ తొలి 4 రోజుల్లో రూ. 3.62 కోట్ల షేర్ రాబట్టగా... 5వ రోజుతో మొత్తం వసూళ్లు రూ. 3.9 కోట్లకు చేరుకుంది. సెలవు రోజు కావడంతో ఆదివారం రూ. 83.25 లక్షలు వసూలు చేయగా... సోమవారం వసూళ్ల జోరు తగ్గింది. రూ. 27.41 లక్షలు మాత్రమే రాబట్టింది.

    ‘మహర్షి' 4 డేస్ కలెక్షన్: రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం‘మహర్షి' 4 డేస్ కలెక్షన్: రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రభంజనం

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో మహర్షి చిత్రం తొలి 4 రోజుల్లో రూ. 5.90 కోట్ల షేర్ వసూలు చేసింది. 5వ రోజుతో ఈ మొత్తం రూ. 6.12 కోట్లకు చేరుకుంది. ఆదివారం(రూ. 55 లక్షలు)తో పోలిస్తే సోమవారం (రూ. 22.45 లక్షలు) రాబడి తగ్గింది. అయితే డిస్ట్రిబ్యూటర్ పెట్టిన పెట్టుబడి దాదాపుగా రికవరీ అయినట్లే అని, తొలివారం తర్వాత లాభాల్లోకి వెళుతుందని అంటున్నారు.

    ఈస్ట్ గోదావరిలో పరిస్థితి...

    ఈస్ట్ గోదావరిలో పరిస్థితి...

    ఈస్ట్ గోదావరిలో మొదటి 4 రోజుల్లో రూ. 4.86 కోట్ల షేర్ రాబట్టింది. 5వ రోజైన సోమవారంతో మొత్తం వసూళ్లు రూ. 5.22 కోట్లకు రీచ్ అయింది. ఇతర ఏరియాలకు సంబంధించి వివరాలు అందాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ‘మహర్షి' వసూళ్లు సంతృప్తికర స్థాయిలోనే ఉన్నాయి. వీక్ డే సోమవారం టెస్ట్ కూడా పాసైంది.

    కలెక్షన్లు పెంచేందుకు రంగంలోకి మహేష్ బాబు

    కలెక్షన్లు పెంచేందుకు రంగంలోకి మహేష్ బాబు

    ‘మహర్షి' మూవీ వసూళ్లు పెంచడానికి మహేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. సోమవారం నుంచి ఆయన వివిధ ఏరియాల్లోని థియేటర్లను విజిట్ చేసి ప్రచారం నిర్వహించబోతున్నారు. దీంతో పాటు రైతులు, విద్యార్థులతో ఇంటకార్ట్ అవుతారని తెలుస్తోంది. ఈ ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మహేష్ బాబు తన హాలిడే ట్రిప్ కూడా వాయిదా వేసుకున్నట్లు టాక్.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    Mahesh Babu's Maharshi has successfully crossed the Rs 50 cr share in Telugu states. The film is still going steady at the box office and is expected to move into the profit zone in the coming week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X