‘మహర్షి’ 3 డేస్ కలెక్షన్స్: లాభం రావాలంటే ఇంకా ఎంత?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీసు దుమ్ము దులుపుతోంది. తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ 3వ రోజుతో రూ. 40 కోట్ల మార్కును అందుకుంది.శనివారం వరకు ఈ చిత్రం రాబట్టిన ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే... నైజాంలో రూ. 13.14 కోట్లు, సీడెడ్ రూ. 5.1 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 5.03 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 4.39 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 3.3 కోట్లు, గుంటూరు రూ. 5.35 కోట్లు, కృష్ణ రూ. రూ. 2.79 కోట్లు, నెల్లూరు రూ. 1.49 కోట్లు... టోటల్ రూ. 40.59 కోట్లు రాబట్టింది.

లాభం రావాలంటే ఇంకా..
'మహర్షి' ఏపీ తెలంగాణ రైట్స్ రూ. 72.10 కోట్లకు అమ్మారు. మరో 32 కోట్లు వసూలైతే లాభాల బాటలోకి వెళ్లనుంది. తొలి వారం పూర్తయ్యేలోపే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా త్వరలోనే రూ. 100 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నైజాంలో వసూళ్లు అదరగొడుతోంది
నైజాం ఏరియా రైట్స్ వ్యాల్యూ రూ. 22 కోట్లుకాగా దిల్ రాజు సొంతగా విడుదల చేశారు. ఇక్కడ మరో 10 కోట్లు వస్తే లాభాల్లోకి వెళ్లనుంది. సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 12 కోట్లు అమ్మగా ఇప్పటి వరకు 5.1 కోట్లు రాబట్టింది. ఉత్రరాంధ్ర రైట్స్ విలువ రూ. 9.10 కోట్లు కాగా.. మూడు రోజుల్లో రూ. 5.03 కోట్లు రాబట్టింది.

అన్ని ఏరియాల్లోనూ కుమ్మేస్తోంది
గుంటూరు రైట్స్ రూ. 7.70 కోట్లకు అమ్మగా... ఇప్పటికే రూ. 5.35 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈస్ట్ గోదావరి రైట్స్ రూ. 6.80 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 4.39 కోట్లు వసూలయ్యాయి. వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 5.70 కోట్లకు అమ్మగా 3 రోజుల్లో రూ. 3.3 కోట్లు వసూలు చేసింది. కృష్ణ రైట్స్ రూ. 5.80 కోట్లకు అమ్మగా... రూ. 2.79 కోట్లు, నెల్లూరు రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మగా... రూ. 1.49 కోట్లు రాబట్టింది.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











