For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డే 1 కలెక్షన్: 5వ స్థానంతో సరిపెట్టుకున్న ‘మహర్షి’

|

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. సినిమా రిలీజ్ ముందు వచ్చిన హైప్ చూస్తే నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొడుతుందని అంచనా వేశారు. నిర్మాత దిల్ రాజు సైతం అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అందుకునే కెపాసిటీ ఉన్న సినిమా అని ప్రకటనలు చేశారు.

అయితే దిల్ రాజు ప్రెడిక్షన్స్ కొంత వరకు నిజమే అయినప్పటికీ అన్ని ఏరియాల్లో వర్కౌట్ కాలేదు. అయితే నైజాంతో పాటు కొన్ని ఏరియాల్లో 'మహర్షి' చిత్రం నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రూ. 24.6 కోట్ల షేర్ రాబట్టింది.

మహేష్ బాబు సినిమా నమ్రత అస్సలు చూడదంట.. కారణం ఇదే!

ఏపీ, తెలంగాణలో టాప్ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులతో కంపేర్ చేస్తే 'మహర్షి' చిత్రం 5వ స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు బాహుబలి 2, అజ్ఞాతవాసి, అరవింద సమేత, వినయ విధేయ రామ చిత్రాలు ఉండటం గమనార్హం.

Maharshi movie AP, TS Day 1 Share Rs 24.6 Cr

రూ. 42.74 కోట్ల షేర్ వసూలు చేసి 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది. రూ. 26.94 కోట్ల తొలి రోజు వసూళ్లతో అజ్ఢాతవాసి నెం.2 స్థానంలో ఉంది. రూ. 26.15 కోట్ల వసూళ్లతో అరవింద సమేత, రూ. 25.87 కోట్ల షేర్ సాధించి వినయ విధేయరామ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

'మహర్షి' మూవీ ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే... నైజాంలో రూ. 6.38 కోట్లు, సీడెడ్ రూ. 2.89 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 2.88 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 3.2 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 2.47 కోట్లు, కృష్ణ రూ. .39 కోట్లు, గుంటూరు 4.4 కోట్లు, నెల్లూరు రూ. 1 కోటి... టోటల్ రూ. 24.6 కోట్లు వసూలు చేసింది.

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

English summary
Maharshi movie AP, TS Day 1 Share Rs 24.6 Cr. Maharshi directed by Vamsi Paidipally and jointly produced by Dil Raju, C. Ashwini Dutt, and Prasad V. Potluri through their production companies Sri Venkateswara Creations, Vyjayanthi Movies, and PVP Cinema. The film stars Mahesh Babu, Allari Naresh, and Pooja Hegde. The music was composed by Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more