twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: ‘రంగస్థలం’తో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢమాల్

    |

    Recommended Video

    Maharshi Solid First Week At Box-offices, Breaks Rangasthalam Records || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రైతుల గురించి తీసిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది.

    బుధవారంతో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 59.37 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసినట్లయింది. బాహుబలి, బాహుబలి 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది.

    ‘రంగస్థలం’తో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢమాల్

    ‘రంగస్థలం’తో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢమాల్

    ఇప్పటి వరకు రూ. 58.32 కోట్ల తొలివారం షేర్‌తో ‘రంగస్థలం' నాన్ బాహుబలి సినిమాల కేటగిరీలో నెం.1 స్థానంలో ఉండేది. రూ. 59.37 కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా ‘మహర్షి' ఆ చిత్రాన్ని వెనక్కి నెట్టేసింది. ఆ తర్వాత స్థానాల్లో అరవింద సమేత (రూ. 58.09 కోట్లు), ఖైదీ నెం.150(రూ. 56.53 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. బాహుబలి 2(రూ. 117 కోట్లు), బాహుబలి(రూ. 61 కోట్లు) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

    ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్

    ఏరియా వైజ్ కలెక్షన్ రిపోర్ట్

    ‘మహర్షి' ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 21.67 కోట్లు, సీడెడ్ రూ. 7.45 కోట్లు, గుంటూరు రూ. 6.43 కోట్లు, కృష్ణ రూ. 4.28 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 5.63 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.34 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 7.47 కోట్లు, నెల్లూరు రూ. 2.1 కోట్లు రాబట్టింది.

    వరల్డ్ వైడ్ షేర్ రూ. 75.2 కోట్లు

    వరల్డ్ వైడ్ షేర్ రూ. 75.2 కోట్లు

    ఇక ‘మహర్షి' వరల్డ్ వైడ్ షేర్ రూ. 75 కోట్లకు రీచ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ మూడు ఏరియాల్లో కలిపి రూ. 8.80 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు రూ. 9 కోట్ల ఫస్ట్ వీక్ షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.

    భరత్ అనే నేను లైఫ్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా

    భరత్ అనే నేను లైఫ్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా

    మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద ‘మహర్షి' జోరు చూస్తుంటే ఫుల్ ర‌న్‌లో ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడంతో సూపర్ స్టార్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా కాలర్ ఎగరవేసి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    మహర్షి

    మహర్షి

    మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

    English summary
    Superstar Mahesh Babu’s Maharshi, has had a solid first week at the box-offices in Andhra and Nizam. The movie collected a whopping Rs 59.37 crore share in AP and Telangana, creating a new non-Baahubali record.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X