‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్: ‘నాన్ బాహుబలి’ రికార్డులు ధ్వంసం...

Recommended Video

Maharshi First Day Collections Report || Filmibeat Telugu

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహర్షి' చిత్రం బాక్సాఫీసు వద్ద తొలిరోజు వసూళ్ల వరద పారించింది. నైజాంతో పాటు పాటు పలు ఏరియాల్లో విధ్వంసకర వసూళ్లు సాధిస్తూ నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. సూపర్ స్టార్ కెరీర్లో ప్రెస్టీజియస్ 25వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ తన స్థాయికి తగిన విధంగానే అదరగొట్టింది.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో 100శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలు వేసినప్పటికీ అభిమానుల తాకిడికి థియేటర్లు కిక్కిరిసిపోయాయి. కొందరు ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేక నిరాశతో వెను దిరిగిన దృశ్యాలు కనిపించాయి.

నైజాంలో నాన్ బాహుబలి2 రికార్డులన్నీ బద్దలు

నైజాంలో నాన్ బాహుబలి2 రికార్డులన్నీ బద్దలు

నైజాం ఏరియాకు ‘మహర్షి' రైట్స్ రూ. 22 కోట్లు లెక్కకట్టారు. ఇక్కడ ఈ చిత్రాన్ని దిల్ రాజు సొంతగా రిలీజ్ చేశారు. తొలి రోజు రూ. 6.38 కోట్లు షేర్ వసూలు చేసింది. దీంతో బాహుబలి 2 మినహా ఇప్పటి వరకు నైజాం ఏరియాలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి.

నైజాం టాప్ రికార్డులు ఇవే..

నైజాం టాప్ రికార్డులు ఇవే..

బాహుబలి 2 మూవీ రూ. 8.92 కోట్ల తొలి రోజు షేర్ సాధించి నైజాం ఏరియాలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానంలో బాహుబలి 1(రూ. 6.29 కోట్లు) ఉండగా... ఆ స్థానాన్ని ఇపుడు ‘మహర్షి' ఆక్రమించింది. ఎన్టీఆర్ మూవీ ‘అరవింద సమేత'(రూ. 5.77 కోట్లు)తో తర్వాతి స్థానంలో ఉంది.

గుంటూరులోనూ కలెక్షన్ల విధ్వంసమే

గుంటూరులోనూ కలెక్షన్ల విధ్వంసమే

గుంటూరులో ఈ చిత్రం తొలి రోజు రూ. 4.40 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఇక్కడ సైతం నాన్ బాహుబలి రికార్డ్ బద్దలైనట్లయింది. మహర్షి తర్వాత స్థానంలో రూ. 4.18 కోట్ల వసూళ్లతో ‘వినయ విధేయ రామ', రూ. 4.16 కోట్ల వసూళ్లతో ‘అరవింద సమేత' చిత్రాలు ఉన్నాయి.

కృష్ణ జిల్లాలోనూ మహర్షి జోరు

కృష్ణ జిల్లాలోనూ మహర్షి జోరు

కృష్ణ జిల్లాలో మహర్షి జోరు కొనసాగింది. తొలి రోజు రూ. 1.39 కోట్లు వసూలు చేసింది. మహేష్ గత చిత్రం భరత్ అనే నేను (రూ. 1.31 కోట్లు) చిత్రాన్ని అధిగమించింది. అయితే ఇక్కడ నాన్ బాహుబలి రికార్డులను మహేష్ బాబు మూవీ దాటలేక పోయినప్పటికీ మంచి వసూళ్లే సాధించింది.

నెల్లూరు ఏరియాలో

నెల్లూరు ఏరియాలో

మహర్షి మూవీ నెల్లూరు ఏరియాలో తొలి రోజు రూ. 1,00,78,244 రాబట్టింది. ఈ ఏరియా థియేట్రికల్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మారు. తొలి రోజే రూ. 1 కోటికి పైగా షేర్ రాబట్టడంతో త్వరలోనే వీరు లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈస్ట్, వెస్ట్‌లో వసూళ్ల జోరు

ఈస్ట్, వెస్ట్‌లో వసూళ్ల జోరు

మరో వైపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాల్లో తొలి రోజు అద్భుతమైన వసూళ్లు సాధించింది. వెస్ట్ గోదావరిలో రూ. 2.46 కోట్ల షేర్ రాబట్టింది. ఇక్కడ రైట్స్ రూ. 5.70 కోట్లకు అమ్మారు. దీంతో మొదటి రోజు సగం పెట్టుబడి రాబట్టినట్లయింది. ఈస్ట్ గోదావరి రైట్స్ రూ. 6.80 కోట్లకు అమ్మగా... తొలి రోజే రూ. 3.20 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X