లాభమా? నష్టమా? ‘మహర్షి’ ఓవర్సీస్ కలెక్షన్స్ క్లోజింగ్ రిపోర్ట్!

Recommended Video

Maharshi Overseas Collections Closing Report || Filmibeat Telugu

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న స్టార్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ప్రతి సినిమా ఇక్కడ 1 మిలియన్ గ్యారంటీ. ఈ నేపథ్యంలో బాబు కొత్త సినిమా విడుదలవుతుందంటే... ఎంత వసూలు చేస్తుందనే ఆసక్తి అటు ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లో ఉండటం సహజం.

మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి' తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి విజయం అందుకుంది. దాదాపు రూ. 175 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే జోరు యూఎస్ఏ మార్కెట్లోనూ కొనసాగుతుందని అంచనా వేశారు కానీ వర్కౌట్ కాలేదు.

ప్రీమియర్ షోల నుంచే షాకుల మీద షాకులు

ప్రీమియర్ షోల నుంచే షాకుల మీద షాకులు

మహేష్ బాబు సినిమా విడుదలవుతుందంటేనే హైప్ ఓ రేంజిలో ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టగానే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. ఇదే ఆంచనాలతో ఓవర్సీస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. కేవలం వీటి ద్వారానే 1 మిలియన్ పైగా వసూలువుతుందని అంచనా వేశారు. అయితే కేవలం హాఫ్ మిలియన్ మాత్రమే రాబట్టి నిరాశ పరిచింది.

బిజినెస్ క్లోజ్, 3వ స్థానంలో

బిజినెస్ క్లోజ్, 3వ స్థానంలో

‘మహర్షి' మే 9న విడుదలైంది. ఈ వారంతో ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ కానుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఇప్పటి వరకు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద $1,888,000 వసూలు చేసింది. మహేష్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. భరత్ అనే నేను, శ్రీముంతుడు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‍‌కు లాభమా? నష్టమా?

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్‍‌కు లాభమా? నష్టమా?

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.... ‘మహర్షి' ఓవర్సీస్ రైట్స్ రూ. 11.5 కోట్లకు అమ్మారట. యూఎస్ఏ, నాన్ యూఎస్ఏ అన్ని ఏరియాలకు కలిపి రూ. 9.55 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ పాయింటును అందుకోక పోవడంతో 1.95 కోట్ల నష్టం ఏర్పడినట్లు టాక్.

మహర్షి

మహర్షి

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X