‘మహర్షి’ అక్కడ రూ. 2 కోట్లు లాస్... రికవరీ కష్టమే!

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతున్నప్పటికీ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ రూ. 2 కోట్లు లాస్ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఫుల్ రన్‍‌లో సైతం రికవరీ కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.

సెకండ్ వీకెండ్ వరకు ఈ మూవీ ఇక్కడ $1.74 మిలియన్ వసూలు చేసింది. ఫుల్ రన్‌లో $1.8 మిలియన్ రీచ్ అయ్యే అవకాశం ఉందట. ప్రేక్షకాదరణ లేక చాలా లొకేషన్లలో సినిమాను ఎత్తేశారు. నెక్ట్స్ వీకెండ్‌తో యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 'మహర్షి' ప్రస్తానం ముగియనుంది.

‘Maharshi’ UAS distributor Rs 2 Cr lose

భారీ ఓపెనింగ్స్ సాధించాలనే ఉద్దేశ్యంలో యూఎస్ఏలో రికార్డు స్థాయి ప్రీమియర్ షోలతో 'మహర్షి' రిలీజ్ చేశారు. అయితే ప్రీమియర్ షోల ద్వారా కనీసం 1 మిలియన్ కూడా రీచ్ కాకపోవడంతో అంచనాలు తలక్రిందులై డిస్ట్రిబ్యూటర్‌కు పెద్ద దెబ్బపడింది.

'మహర్షి' రిలీజ్ ముందు ఓవర్సీస్ రైట్స్ విషయంలో చాలా చర్చలు జరిగాయి. ఈ చిత్రాన్ని 16 నుంచి 18 కోట్ల రేంజిలో అమ్మాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అయితే మహేష్ గత చిత్రం 'భరత్ అనే నేను' సైతం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద గొప్ప ఫలితాలు ఇవ్వక పోవడంతో అంత మొత్తం పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు రూ. 14 కోట్లు డీల్ సెటిలైంది.

‘Maharshi’ UAS distributor Rs 2 Cr lose

అయితే ఇండియాలో పరిస్థితి మరోలా ఉంది. 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు దాదాపు 95 శాతం వరకు పెట్టుబడి రికవరీ చేసుకున్నారు. మరో వారంలో అంతా లాభాల్లోకి వెళ్లనున్నారు. కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు ప్రాఫిట్ జోన్లోకి ఎంటయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X