యూఎస్ఏ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్: ‘మహర్షి’ పరిస్థితి ఎలా ఉందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద భారీ ఓపెన్సింగ్ సాధించడంలో కాస్త తడబడ్డప్పటికీ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి సత్తా చాటింది. ఆదివారంతో ఈ చిత్ర కలెక్షన్లు 1.4 మిలియన్ డాలర్ మార్క్ రీచ్ అయింది.

Maharshi USA first weekend collection report

మహేష్ బాబు కెరీర్లో మాత్రమే కాదు.. బాహుబలి 2 రిలీజ్ రికార్డులను సైతం బద్దలు కొడుతూ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధికంగా 2500 ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద 'మహర్షి'ప్రయాణం ప్రారంభం అయింది. ప్రీమియర్ షోల ద్వారా సంచలన రికార్డులను నమోదు చేస్తుందని అంచనా వేశారు.

అయితే అందరి ఎక్స్‌పెక్టేషన్స్ తారుమారు చేస్తూ ప్రీమియర్ షోల ద్వారా మహేష్ బాబు మూవీ కేవలం $ 515K మాత్రమే రాబట్టింది. గురువారం, శుక్రవారం గడిచిన తర్వాత కూడా 1 మిలియన్ మార్కను అందుకోవడంలో విఫలం అయింది. అయితే శని, ఆదివారాల్లో కలెక్షన్స్ డీసెంటుగా ఉండటంతో 1.5 మిలియన్ మార్క్ చేరువైంది.

'మహర్షి' సినిమాపై వచ్చిన డబుల్ పాజిటివ్ హైప్, మహేష్ బాబు సినిమాలకు యూఎస్ఏలో ఉన్న డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పోలిస్తే 4 రోజులతో కూడిన తొలివారాంతం 1.4 మిలియన్ రావడం ఎబోయావరేజ్ వసూళ్లుగా పేర్కొనక తప్పదు. ఓపెనింగ్స్ కాస్త వీక్ అయినప్పటికీ మంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుండటంతో వసూళ్లు క్రమక్రమంగా పెరిగాయి.

Maharshi USA first weekend collection report

ప్రస్తుతం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 'మహర్షి' పరిస్థితి చూస్తే... ఫుల్ రన్‌లో 2 విమిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. 'గ్రేట్ ఇండియా' ఫిల్మ్స్ వారు ఈ మూవీ రైట్స్ రూ. 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఫుల్ రన్‌లో పెట్టుబడి రికవరీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా 'మహర్షి' తెరకెక్కింది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా... అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఈ చిత్రంలో అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X