Mahavatar Narsimha Collection: బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న మహావతార్ నర్సింహా.. కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా రూపొందించిన చిత్రం మహావతార్ నర్సింహా. యానిమేటెడ్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు అశ్వినీ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. క్లీమ్ ప్రొడక్షన్స్ ఎడిటింగ్, జయపూర్ణ దాస్ రచన సహకారం అందించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? 4 రోజులుగా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
కేజీఎఫ్, కాంతారా లాంటి పాపులర్ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సారథ్యంలో పూర్తి యానిమేటెడ్ సినిమాగా ఈ చిత్రం రూపొందింది. లేటేస్ట్ టెక్నాలజీ, సౌండ్, వీఎఫ్ఎక్స్ అంశాలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఈ కథలో ఎమోషన్స్ లేకపోయినా.. సాంకేతిక విభాగాల పనితీరు అద్బుతంగా ఉండటంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి గురవుతున్నారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు విలువ కట్టాయి.

మహావతార్ సినిమా రిలీజ్‌కు ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. నామమాత్రంగానే ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాకు మౌత్ టాక్ భారీగా కలిసి వచ్చింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు పుంజుకొనేలా చేశాయి. దాంతో ఈ సినిమా రోజు రోజుకు భారీగా కలెక్షన్లు రాబడుతున్నది అనేది ట్రేడ్ వర్గాలు సమాచారంతో స్పష్టమైంది.
భక్త ప్లహ్లదుడి కథతో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు అంతంతా మాత్రంగానే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా రెండో రోజును నుంచి కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. తొలి రోజు ఈ సినిమా 1.75 కోట్ల రూపాయలు, రెండో రోజు 4.6 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు భాషలో 4 కోట్ల రూపాయలు, హిందీలో 11.5 కోట్ల రూపాయలు, కన్నడలో 50 లక్షల రూపాయలు, తమిళంలో 40 లక్షల రూపాయలు, మలయాళంలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 17 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.
ఇక 4వ రోజు ఈ సినిమా నిలకడగా కలెక్షన్లను సాధించనున్నది. ఈ చిత్రం సోమవారం రోజున 3 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వసూళ్లు సాధించనున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో దాదాపు 50 శాతానికి పైగా కలెక్షన్లు వసూలు చేసిందని పేర్కొన్నాయి. ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన ఓవర్సీస్‌లో రిలీజ్ కానున్నది.
మహావతార్ నర్సింహ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా సగానికిపైగా వసూళ్లు సాధించినందున ఈ వారం ముగిసే సమయానికి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











