Mahavatar Narsimha Day 10 Collections: మహావతార్ నర్సింహ మూవీ 10వ రోజు కలెక్షన్స్.. అత్యధికం.. ఎన్ని కోట్లంటే?
స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా కలెక్షన్లు రాబడుతోంది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లన్నీ ఈ చిత్రంతో టెంపుల్స్ ను ప్రతిబింబిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతనతో ఆడియెన్స్ పులకించి పోతున్నారు. అయితే ఈ చిత్రం ఓపెనింగ్ డేతో పోల్చితే తర్వాత రోజుల్లో భారీగా వసూళ్లు సాధిస్తూ వస్తోంది. జూలై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? 10వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడ భాషలో రూపుదిద్దుకున్న యానిమేటెడ్ యాక్షన్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అలాగే క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యింది. ఈ చిత్రానికి వీఎఫ్ ఎక్స్ టీమ్, యానిమినేషన్ టీమ్, మ్యూజిక్, డైరెక్షన్ డిపార్ట్ మెంటే ప్రధాన పాత్రను పోషించాయి. దీంతో ఈ చిత్రానికి టెక్నికల్ గానే ఖర్చైంది. ఈ యానిమేటెడ్ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే వరకు 15 కోట్ల పెట్టుబడి అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. శిల్పా దవన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ అందించిన సంగీతం ఆకట్టుకుంది.

ప్రీ రిలీజ్ బిజినెస్?
యానిమేటెడ్ చిత్రం అయినప్పటికీ హిందూ పురాణాలను చెప్పే కథ కావడంతో మహావతార్ నర్సింహా చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ సినిమా విడుదలకు థియేటర్లు లభించాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పర్లేదని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావలంటే 30 రూపాయల కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.
9 రోజుల వసూళ్లు ఇలా..
మహావతార్ నర్సింహా చిత్రానికి ఓపెనింగ్ రోజు 2 కోట్ల రూపాయలు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు వసూల్ చేసింది. ఇలా 9 రోజుల్లో ఈ చిత్రానికి టోటల్ గా 67.85 కోట్ల వరకు ఇండాయా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఈ చిత్రానికి 9వ రోజు వరకు ఇండియా గ్రాస్ 80.75 కోట్లు, ఓవర్సీస్ రూ.2.25 కోట్లు కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని 83 కోట్ల గ్రాస్ వరల్డ్ వైడ్ గా వసూల్ చేసిందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.
10వ సెన్సేషన్ వసూళ్లు..
ఆదివారం ఆగస్టు 3న మహావతార్ నర్సింహ యానిమేటెడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అందించిన వసూళ్లలో 10వ రోజు అత్యధికంగా వసూళ్లు అందుకుంది. ఒక్క రోజే ఏకంగా రూ.23.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో 10వ రోజు వరకు ఇండియా నెట్ 91.45 కోట్లకు చేరుకోవడం విశేషం. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్ల గ్రాస్ అందుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ చిత్రం 300 శాతం వరకు రికవరీ చేయడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది.


Click it and Unblock the Notifications











