Mahavatar Narsimha Day 12 Collections: 100 కోట్లు లాభమే.. మహావతార్ నర్సింహా 12వ రోజు వసూళ్ల జాతర.. ఎన్ని కోట్ల

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం దుమ్ములేపుతున్న చిత్రం మహావతార్ నర్సింహా. ఇదొక యానిమేటెడ్ చిత్రం కావడం విశేషం. ఓవైపు స్టార్ హీరోల చిత్రాలు భారీ ప్రమోషన్స్, హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతంత మాత్రానే వసూళ్లు కలెక్ట్ చేస్తున్నాయి. కానీ ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ గా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహా యానిమేటెడ్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూల్ చేసింది? ఎన్ని కోట్ల లాభం వచ్చింది? 12వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూల్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ యానిమేటెడ్ ఫిల్మ్ ను రూపొందించాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా శిల్పా దవన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ వ్యవహరించారు. ఇక చిత్రంలో ఆర్టిస్ట్ లు లేకపోవడంతో యానిమిమేషన్ టీమ్, వీఎఫ్ఎక్స్ టీమ్, గ్రాఫిక్ టీమ్, మ్యూజిక్ టీమ్ ప్రధాన పాత్రలు పోషించాయి. ఇక వారి రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులు కలుపుకొని సినిమాకు 15 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Mahavatar Narsimha Movie Day 12 Box Office Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్?
భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న యానిమేటెడ్ చిత్రం కావడంతో మహావతార్ నర్సింహం చిత్రానికి ప్రీరిలీజ్ బిజినెస్ లో మంచి రెస్పాన్స్ లభించింది. పైగా హిందూ పురణాలను చెప్పే యానిమేటెడ్ ఫిల్మ్ కావడం కూడానూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను పెంచింది. ఈ చిత్రానికి మొత్తంగా 10 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని, ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

11 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాకు కేవలం రూ.2 కోట్ల ఇండియా నెట్ మాత్రమే లభించింది. ఇక 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 11 రోజుల్లో టోటల్ గా ఇండియా నెట్ 98.3 కోట్ల రూపాయలకు చేరుకుంది.

12వ రోజు కలెక్షన్స్..
మహావతార్ నర్సింహా చిత్రానికి వర్కింగ్ డేస్ లోనూ వసూళ్లు జోరుగా అందుతున్నాయి. 12వ రోజు కూడా భారీగా కలెక్షన్ అందింది. కన్నడలో 23 లక్షల రూపాయలు, హిందీలో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 1.6 కోట్ల రూపాయలు, తమిళంలో 6 లక్షల రూపాయలు, మలయాళంలో 1లక్ష చొప్పున కలిపి 12వ రోజు ఇండియా నెట్ 7.90 కోట్ల రూపాయలు వసూల్ చేసింది. అంటే 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది.

వరల్డ్ వైడ్ గా కలెక్షన్ ఎంత? ఎన్ని కోట్ల లాభం..
12వ రోజు వరకు మహావతార్ నర్సింహా చిత్రానికి కన్నడలో రూ.2.79 కోట్లు, తెలుగులో రూ.23.72 కోట్లు, హిందీలో రూ.78.2 కోట్లు, తమిళంలో రూ.1.22 కోట్లు, మలయాళంలో రూ.27 లక్షల నెట్ వసూల్ చేసింది. ఇలా మొత్తంగా 106 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ అయ్యింది. గ్రాస్ 120 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక ఓవర్సీస్ నుంచి 4 కోట్ల రూపాయల గ్రాస్ అందింది. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా టోటల్ రూ.135 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా లాభం వచ్చిందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X