Mahavatar Narsimha Day 14 Collections: మహావతార్ నర్సింహా 2 వారాల టోటల్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల లాభమంటే?
స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానీ వసూళ్లను యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహ చిత్రం సాధిస్తోంది. జూలై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓపెనింగ్ డే తక్కువగానే వసూళ్లు చేసినా.. 2వ రోజు నుంచే వసూళ్లు ఊపందుకున్నాయి. 2 వారాలుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. లాభాల బాటలో పయనిస్తోంది. ఈ క్రమంలో మహావతార్ నర్సింహా చిత్రం బడ్జెట్ ఎంత? 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? లాభం ఎంత వచ్చింది అనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
సాండల్ వుడ్ లో నిర్మితమైన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా. కన్నడ చిత్ర పరిశ్రమలోని టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ టీమ్ ప్రధాన పాత్రలు పోషించాయి. దాంతో నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ అన్నీ కలిపి ఈ యానిమేటెడ్ ఫిల్మ్ కు రూ.15 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రం 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

13 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా 13వ రోజు వరకు ఇండియా నెట్ వసూళ్లు 113 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
14వ రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..
2 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన మహావతార్ నర్సింహా చిత్రం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. మాతృభాష కన్నడలో, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రానికి వసూళ్లు ఆగిపోయాయి. ఇక 14వ రోజు కేవలం తెలుగు, హిందీ భాషల్లో వసూళ్లు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగులో రూ.1 కోటి రూపాయలు, హిందీలో రూ.4 కోట్ల ఇండియా నెట్ వసూల్ అయ్యింది. దీంతో ఇండియా నెట్ 118 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ 144 కోట్లు కాగా, ఓవర్సీస్ లో 6 కోట్ల రూపాయల గ్రాస్ అందింది. ఇలా వరల్డ్ వైడ్ గా 14 రోజుల్లో 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
స్టేట్ వైజ్ టోటల్ కలెక్షన్స్? ప్రాఫిట్?
14 రోజుల్లో మహావతార్ నర్సింహా చిత్రానికి కన్నడ భాషలో రూ.3 కోట్లు, తెలుగులో స్టేట్స్ లో రూ.26 కోట్లు, హిందీలో రూ.87 కోట్లు, తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 30 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. కాగా ఈ చిత్రం 30 కోట్లు దాటితే ప్రాఫిట్ లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు లెక్క గట్టారు. కానీ మహావతార్ నర్సింహా 150 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో బాక్సాఫీస్ నుంచి అందిన వసూళ్లలో అన్ని ఖర్చులు పోనూ 120 కోట్ల వరకు లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











