Mahavatar Narsimha Day 15 Collections: మహావతార్ నర్సింహా 15వ రోజు వసూళ్లు.. 3వ వారంలోనూ జోరు.. ఎన్ని కోట్లంటే?
మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. 2 వారాలుగా దుమ్ములేపిన ఈ యానిమేటెడ్ ఫిల్మ్ ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోలకే బాక్సాఫీస్ వద్ద దక్కని వసూళ్లను ఈ చిత్రం దక్కించుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. జూలై 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహావతార్ నర్సింహ చిత్రం ఇప్పటికీ థియేట్రికల్ రన్ జోరుగా కొనిసాగిస్తోంది. ఈ క్రమంలో మహావతార్ నర్సింహ యానిమేటెడ్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? 15 రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహ. టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో నటీనటులు లేరు. యానిమేటెడ్ ఫిల్మ్ కావడంతో యానిమేషన్ డిపార్ట్ మెంట్, వీఎఫ్ఎక్స్ టీమ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ టీమ్ పై ఎక్కువ ఖర్చు చేశారు. మొత్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుందని విలువ కట్టారు.

14 రోజుల వసూళ్లు ఎంత?
మహావతార్ నర్సింహ ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇలా 2 వారాలు పూర్తయ్యే సరికి 73.4 కోట్లకు ఇండియా నెట్ చేరుకుంది.
15వ రోజు మరింత జోరుగా..
మహావతార్ నర్సింహ చిత్రానికి 3వ వారం ఎంట్రీలోనే జోరుగా వసూళ్లు అందడం విశేషం. 15వ రోజు కన్నడలో 35 లక్షలు, తెలుగులో రూ.1.85 కోట్లు, హిందీలో రూ.5.75 కోట్లు, తమిళంలో 13 లక్షలు, మలయాళంలో 2 లక్షలు వసూల్ చేసింది. ఇలా మొత్తంగా 8.10 కోట్ల నెట్ వసూల్ చేసింది సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో గ్రాస్ 15 కోట్ల వరకు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
రాష్ట్రాల వారీగా కలెక్షన్ల వివరాలు..
15వ రోజు వరకు తెలుగు స్టేట్స్ లో రూ.28 కోట్లు, కన్నడలో రూ.3.50 కోట్లు, హిందీలో రూ.93 కోట్లు, తమిళంలో 1.50 కోట్లు, మలయాళంలో 32 లక్షలు వసూళ్లు చేసింది. ఇలా ఇండియా నెట్ మొత్తం రూ.127 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక ఇండియా గ్రాస్ 150 కోట్లకు చేరుకోగా, ఓవర్సీస్ లో 6 కోట్లు వసూళ్లైంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 160 కోట్లు వసూలైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











