Mahavatar Narshima Day 16 Collections: 200 కోట్లు.. 3వ వారంలో మహావతార్ నర్సింహా దుకూడు.. 16వ రోజు ఎన్ని కోట్లం
వారం వారం వసూళ్లు పెంచుకుంటూనే పోతోంది ఇండియన్ మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహ. జూలై 25న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 3వ వారం ప్రారంభమే వీకెండ్ కలిసి రావడంతో మరింత జోరుగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహ యానిమేటెడ్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? 16వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బడ్జెట్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మహావతార్ నర్సింహ చిత్రాన్ని నిర్మించాయి. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్ టీమ్ సినిమాకు ప్రధాన పాత్రలు పోషించాయి. దాంతో వారి రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

15 రోజుల వసూళ్లు ఎంత?
మహావతార్ నర్సింహ ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్ల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. 15 రోజుల్లో 126 కోట్ల రూపాయలకు ఇండియా నెట్ చేరుకుంది. ఇందులో కన్నడలో రూ.4 కోట్లు, తెలుగులో రూ.28 కోట్లు, హిందీలో రూ.93 కోట్లు, తమిళంలో రూ.1.5 కోట్లు, మలయాళంలో 32 లక్షల రూపాయల వసూళ్లను అందుకుంది.
16వ రోజు మరింత జోరుగా..
ప్రస్తుతం మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్లు సాధిస్తోంది. 3వ వారంలోకి అడుగు పెట్టినా వసూళ్లు పలచబడక మరింత డబుల్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. కేవలం 16వ రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. కన్నడలో రూ.70 లక్షలు, తెలుగులో రూ.3.5 కోట్లు, హిందీలో రూ.15 కోట్లు, తమిళంలో రూ.40 లక్షలు, మలయాళంలో రూ.5 లక్షలు వసూల్ చేసింది. ఇలా ఇండియా నెట్ రూ.19.5 కోట్లు వసూల్ చేయడం సెన్సేషన్ గా మారింది. ఇక ఓవర్సీస్ ఇతర వసూళ్లతో రూ.20 కోట్ల ఇండియా నెట్, రూ.35 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
200 కోట్ల గ్రాస్..
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నర్సింహా చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు అందుతున్నాయి. మొదటి వారం ఈ చిత్రినికి 45 కోట్ల ఇండియా నెట్, 2వ వారంలో 74 కోట్లు రూపాయలు వసూళ్లు చేసింది. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో పోల్చితే 2వ వారం 30 శాతం వసూళ్లు పెరిగాయి. ఇక 3వ వారంలోనూ మరింతగా వసూళ్లు అందుతుండటం విశేషం. 16వ రోజు వరకు ఈ చిత్రం ఇండియా నెట్ 145 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.170 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ లో 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసింది. ఇలా ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.180 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు తెలుపుతున్నారు. ఆదివారం వసూళ్లతో 200 క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పనుందని ట్రేడ్ నిపుణుల అంచనా.


Click it and Unblock the Notifications











