Mahavatar Narshima Day 17 Collections: మహావతార్ నర్సింహా 17వ రోజు కలెక్షన్స్.. ఆ రికార్డులన్నీ చెల్లాచెదురు?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార్ నర్సింహా. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. 3వ వారంలోనూ మంచి వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద రఫాడిపోతోంది. ఇప్పటికే 150 కోట్ల రూపాయల మార్క్ ను దాటింది. జూలై 25న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ ఫిల్మ్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహ యానిమేటెడ్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? 17వ రోజు వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

బడ్జెట్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రూపుదిద్దుకున్న యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాలో పూర్తిగా నటీనటులు లేరు. కేవలం ఈ చిత్రానికి డైరెక్షన్ టీమ్, యానిమేషన్ టీమ్, వీఎఫ్ఎక్స్ టీమ్, గ్రాఫిక్స్ టీమ్ శ్రమించింది. వారే కీలక పాత్రలు పోషించారు. ఇలా టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు అన్నీ కలుపుకుని సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. కాగా ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు నిర్ణయించారు.

Mahavatar Narsimha Movie Day 17 Box Office Collections Worldwide

16 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇలా కేవలం 16 రోజుల్లో హిందీలో 109 కోట్లు, తెలుగులో 31 కోట్లు, కన్నడలో 4 కోట్లు, తమిళంలో 2 కోట్లు, మలయాళంలో 37 లక్షలు కలెక్ట్ చేసిందని, ఇలా పూర్తిగా ఇండియా నెట్ రూ.145 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

17వ రికార్డ్ స్థాయిలో వసూళ్లు..
మూడవ వీకెండ్ కూడా మహావతార్ నర్సింహా చిత్రానికి భారీ వసూళ్లను అందించింది. 17వ రోజు హిందీలో రూ.17.5 కోట్ల నెట్, తెలుగులో రూ.4 కోట్లు, కన్నడలో 85 లక్షలు, తమిళంలో 40 లక్షలు, మలయాళంలో 5 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా కేవలం 17వ రోజు మాత్రమే 23 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో 17వ రోజు వరకు ఇండియా నెట్ టోటల్ గా రూ.169 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ 200 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 10 కోట్ల రూపాయలు వసూల్ అయ్యింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని టోటల్ గా 210 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.

స్టేట్ వైజ్ గా వసూళ్లు.. అక్కడ రికార్డ్ బ్రేక్..
కన్నడ చిత్ర పరిశ్రమలో 17వ రోజు వరకు 5 కోట్ల రూపాయల నెట్, తెలుగులో రూ.35 కోట్ల నెట్, తమిళంలో రూ.2.5 కోట్లు, మలయాళంలో 50 లక్షలు వసూల్ చేసింది. ఇక హిందీలో మాత్రం ఏకంగా 127 కోట్ల నెట్ వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే అక్కడ పుష్ఫ 2 చిత్రం, ఛావా చిత్రాలు నెలకొల్పిన రికార్డులను మహావతార్ నర్సింహా 100 కోట్ల క్లబ్ లో చేరి చెల్లాచెదురు చేసింది. ఒక యానిమేటెడ్ ఫిల్మ్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X