Mahavatar Narshima Day 18 Collections: 18వ రోజు రికార్డు కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద మహావతార్ నర్సింహా జాతర
3వ వారంలో కూడా జోరుగా వసూళ్లు సాధిస్తోంది యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. వీకెండ్ లో రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ ఉంటే.. వర్కింగ్ డేలో కూడా కోట్లల్లో వసూళ్లు అందుకుంటోంది. జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహా చిత్రం బడ్జెట్ ఎంత? 18వ రోజు వరల్డ్ వైడ్ ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
మైథలాజికల్ యానిమేటెడ్ యాక్షన్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా చిత్రాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. కన్నడ చిత్ర పరిశ్రమలోని టాప్ ఫిల్మ్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో రూపుదిద్దుకుంది. యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాలో నటీనటులు లేరు. యానిమేషన్ టీమ్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్షన్ టీమ్, మ్యూజిక్ టీమ్ ప్రధాన పాత్రలు పోషించాయి. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక 30 కోట్లు బ్రేక్ ఈవెన్ పాయింట్ గా నిర్ణయించారు.

17 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 17వ రోజు వరకు ఇండియా నెట్ 169 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇందులో నుంచి హిందీలో 127 కోట్లు, తెలుగులో రూ.36 కోట్లు, కన్నడలో రూ.5 కోట్లు, తమిళంలో 2.25 కోట్లు, మలయాళంలో 50 లక్షల రూపాయల కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
18వ రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్..
సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మహావతార్ నర్సింహా చిత్రం దుమ్ములేపింది. ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా వసూళ్లు సాధ్యపడని విధంగా ఈ యానిమేటెడ్ ఫిల్మ్ రాబడుతోంది. 3వ వారంలో కూడా గట్టిగానే వసూళ్లు అందుకుంటోంది. 18వ రోజు కన్నడలో రూ.25 లక్షల నెట్, తెలుగులో రూ.1.50 కోట్లు, హిందీలో రూ.3.75 కోట్లు వసూళ్లు చేసింది. తమిళంలో రూ.20 లక్షలు, మలయాళంలో రూ.5 లక్షలు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా కేవలం 18వ రోజు 6 కోట్ల రూపాయల ఇండియా నెట్, 10 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. వర్కింగ్ డే కూడా ఈ స్థాయిలో వసూళ్లు అందడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
స్టేట్ వైజ్ గా కలెక్షన్స్.. బాలీవుడ్ లో మోత
కన్నడ చిత్ర పరిశ్రమలో 18వ రోజు వరకు రాష్ట్రాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి. కన్నడలో రూ.5.20 కోట్ల నెట్, తెలుగులో రూ.36.5 కోట్ల నెట్, హిందీలో 131 కోట్ల నెట్, తమిళంలో రూ.2.50 కోట్లు, మలయాళంలో రూ.50 లక్షలు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మహావతార్ నర్సింహా ఇండియా నెట్ 18 రోజుల్లో రూ.175 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ 210 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్ లో 11 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైందని ట్రైడ్ వర్గాల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటి వరకు 200 కోట్ల లాభమే అందుకుందీ చిత్రం. ఇక సౌత్ ఫిల్మ్ గా విడుదలై అత్యధికంగా బాలీవుడ్ నుంచి వసూళ్లు సాధించడం విశేషం.


Click it and Unblock the Notifications











