Mahavatar Narshima Day 19 Collections: చరిత్ర సృష్టించిన మహావతార్ నర్సింహా.. 19వ రోజులు జోరుగా కలెక్షన్స్.. ఎన
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హిందూ మైథాలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా వసూళ్ల దండోరా మోగిస్తోంది. 3వ వారంలో కూడా కోట్లల్లో వసూళ్లు సాధిస్తూ ఆశ్చర్యపరిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 200 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహ చిత్రం బడ్జెట్ ఎంత? 19వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? ఎన్ని కోట్లు లాభం అందుకుందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
మహావతార్ నర్సింహా చిత్రాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. టాప్ ఫిల్మ్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో బ్యానర్లలో రూపొందించారు. ఈ చిత్రానికి ప్రధానంగా యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ డిపార్ట్ మెంట్ కే ఖర్చు అయ్యింది. ఇక రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలుపుకొని 15 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని బ్రేక్ ఈవెన్ పాయింట్ ను నిర్ణయించారు.

18 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్ల ఇండియా నెట్ వసూలైంది.
19వ రోజు వసూళ్లు?
మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఈ చిత్రం 6 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూళ్లు సాధించడం సంచలనంగా మారింది. ఇందులో కన్నడ నుంచి రూ.25 లక్షలు, తెలుగులో రూ.1 కోటి, హిందీలో రూ.4.65 కోట్లు, తమిళంలో రూ.10 లక్షలు వసూళ్లు చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 19వ రోజు వరకు కన్నడలో రూ.5.50 కోట్లు నెట్, తెలుులో రూ.37 కోట్లు, హిందీలో రూ.135 కోట్లు, తమిళంలో రూ.2.50 కోట్లు, మలయాళంలో రూ.50 లక్షలు వసూళ్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలిపాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. లాభం..
ఇండియా నెట్ రూ.181 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.210 కోట్లు వసూలైంది. ఇక ఓవర్సీస్ లో రూ.13 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని రూ.240 కోట్లు వసూలైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ చిత్రం మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటేసింది. 19వ రోజు వరకు 210 కోట్ల రూపాయల లాభంతో ముందుకు సాగుతోంది. ఇక ఈ చిత్రం ఇండియన్ యానిమేషన్ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications











