Mahavatar Narasimha Day 20 Collections: కూలి, వార్ 2తో మహావతార్ నర్సింహాకు బ్రేక్.. 20వ రోజు ఎన్ని కోట్లంటే?

3 వారాలుగా హిందూ మైథలాజికల్ యానిమేటెడ్ ఫిల్మ్ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇక ప్రస్తుతం వార్ 2, కూలి చిత్రాలు విడుదల కావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్పామ్ చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా మహావతార్ నర్సింహా ఫిల్మ్ బడ్జెట్ ఎంత? 20వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? ఎన్ని కోట్లు లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..

మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి థియేటర్లలో వచ్చిన మహావతార్ నర్సింహా చిత్రం చిన్న బడ్జెట్ తోనే రూపుదిద్దుకుంది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా, టాప్ ఫిల్మ్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో పెద్దగా నటీనటులు లేరు. యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ టీమ్స్ ప్రధాన పాత్రలు పోషించాయి. ఇలా రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.15 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను బ్రేక్ ఈవెన్ పాయింట్ గా నిర్ణయించారు.

Mahavatar Narsimha Movie Day 20 Box Office Collections Worldwide

19 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది.

20వ రోజు కలెక్షన్స్?
బుధవారం ఈ చిత్రానికి మంచి వసూళ్లు అందాయి. కన్నడ రూ.25 లక్షలు, తెలుగు రూ.85 లక్షలు, హిందీ రూ.3.35 కోట్లు, తమిళంలో 10 లక్షల రూపాయలు, మలయాళంలో 1 లక్ష రూపాయలు వసూల్ చేసింది. ఇలా 20వ రోజు ఇండియా నెట్ రూ.4.60 కోట్లు వసూళ్లు అందుకుందని సాక్ నిక్ తెలిపింది. ఇలా 20రోజుల్లో టోటల్ గా ఇండియా నెట్ రూ.195 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.225 కోట్లు, ఓవర్సీస్ లో రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.240 కోట్లు వసూలైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

స్టేట్ వైజ్ గా..
కన్నడలో రూ.6 కోట్లు, తెలుగులో రూ.38 కోట్లు, హిందీలో రూ.139 కోట్లు, తమిళంలో రూ.2.50 కోట్లు, మలయాళంలో రూ.50 లక్షల ఇండియా నెట్ వసూల్ చేయడం విశేషం. ఇప్పటి వరకు 240 కోట్ల గ్రాస్ వసూల్ కాగా.. ఇందులో 210 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ అందడం విశేషం. ఇక ఈ చిత్రం వసూళ్లు ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయాయి. కానీ రజనీకాంత్ కూలి, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X