Mahavatar Narasimha Day 21 Collections : మహావతార్ నర్సింహా 3 వారాల కలెక్షన్స్.. 21వ రోజు కూలి, వార్ 2కు షాక్
యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. గత 3 వారాలుగా ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ప్రస్తుతం 3వ వారాన్ని కూడా మహావతార్ నర్సింహా చిత్రం విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా థియేటర్లలోకి రజనీకాంత్ కూలి చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కూడా పోటీనిస్తూ మహావతార్ నర్సింహా చిత్రం వసూళ్లు సాధిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమా బడ్జెట్ ఎంత? 21వ రోజు వరల్డ్ వైడ్ గా ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? 3వ వారం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన మహావతార్ నర్సింహా చిత్రాన్ని కన్నడ టాప్ ఫిల్మ్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. యానిమేషన్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ కు అత్యధికంగా ఖర్చు పెట్టారు. అయినా ఈచిత్రం చిన్న బడ్జెట్ సినిమాగానే థియేటర్లోకి వచ్చింది. అన్ని ఖర్చులు, రెమ్యునరేషన్లు కలుపుకొని సినిమాకు రూ.15 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని నిర్ణయించారు.

20 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు, 20వ రోజు రూ.4.75 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ లెక్కలు తెలుపుతున్నాయి.
21వ రోజు కలెక్షన్స్?
జూలై 25న థియేటర్లలోకి వచ్చిన మహావతార్ నర్సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద 3 వారాలను కంప్లీట్ చేసుకుంది. 21వ రోజు ఈ చిత్రం కన్నడలో రూ.15 లక్షలు, తెలుగులో రూ.20 లక్షలు, హిందీలో రూ.2.35 కోట్లు, తమిళం+మలయాళంలో కలిపి రూ.10 లక్షల వసూళ్లు అందాయి. మొత్తంగా రూ.3 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు అందుకుందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.
3వారాల్లో వరల్డ్ వైడ్ గా..
మహావతార్ నర్సింహా చిత్రం ఓపెనింగ్ డే 2.75 కోట్లు వసూళ్లు చేసింది. కానీ క్రమక్రమంగా కలెక్షన్స్ ను భారీగా పెంచుకుంటూ వచ్చింది. ఇలా 3వ వారం పూర్తయ్యే సరికి ఇండియా నెట్ రూ. 195 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.235 కోట్లు, ఇక ఓవర్సీస్ లో రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ. 250 కోట్ల వరకు రాబట్టిందని ట్రేడ్ వర్గాల లెక్కలు తెలుపుతున్నాయి.
స్టేట్ వైజ్ గా 21రోజుల వసూళ్ల వివరాలు..
కర్ణాటక రాష్ట్రంలో రూ.6 కోట్లు, తెలంగాణ+ఏపీ కలుపుకొని రూ.38.5 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 142 కోట్లు, తమిళ నాడులో రూ.2.50 కోట్లు, కేరళలో రూ.50 లక్షల వరకు నెట్ వసూల్ చేయడం విశేషం. ఇక కూలి, వార్ 2 వంటి భారీ చిత్రాలు విడుదలైనా కూడా పోటీని తట్టుకునే కనిపిస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా 4వ వారంలో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం 200 కోట్లకు పైగా లాభాన్ని అందుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications











