Mahavatar Narasimha Collections: 300 కోట్ల క్లబ్‌లో మహావతార్ నరసింహా.. యానిమేషన్ మూవీ సరికొత్త చరిత్ర
స్టార్లు, క్రేజీ కాంబినేషన్లు లేకపోయినా మహావతార్ నరసింహ సినిమాకు జనం ప్రభంజనం సృష్టిస్తోంది. కథలో దమ్ముంటే సినిమాను ఎవరూ ఆపలేరని మహావతార్ నరసింహా నిరూపించింది. ఓ చిన్న యానిమేషన్ సినిమా దెబ్బకు థియేటర్లన్నీ నరసింహ ఆలయాలుగా మారిపోయాయి. ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి .. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహా నిలిచింది. ఈ నేపథ్యంలో మహావతార్ నరసింహా సినిమా బడ్జెట్ ఎంత? 32 రోజుల వరకు ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
ఈ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాను హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు రూ.15 కోట్లు ఖర్చైంది, ఇక లాభాల్లోకి రావాలంటే రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

31 రోజుల వసూళ్లు ఎంత?
మహావతార్ నర్సింహా చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు వసూల్లు చేసింది.
ఇక 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు, 20వ రోజు రూ.4.75 కోట్లు, 21వ రోజు రూ.2.6 కోట్లు, 22వ రోజు రూ.7.25 కోట్లు, 23వ రోజు రూ.6.75 కోట్లు, 24వ రోజు రూ.8.15 కోట్లు, 25వ రోజు రూ.2.35 కోట్లు, 26వ రోజున 2.5 కోట్ల రూపాయలు, 27వ రోజు 2 కోట్ల రూపాయలు, 28వ రోజు 1.80 కోట్ల రూపాయలు, 29వ రోజున 2 కోట్ల రూపాయలు, 30వ రోజున 6 కోట్ల రూపాయలు, 31వ రోజున 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియా వైడ్‌గా 31 రోజుల వరకు 231 కోట్ల రూపాయల నెట్, 273 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 25 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో 31 రోజుల వరకు మహావతార్ నరసింహా వరల్డ్ వైడ్‌గా 298 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది ఈ చిత్రం.
ఏరియాల వారీగా మహావతార్ నరసింహా కలెక్షన్స్ పరిశీలిస్తే.. హిందీలో 174 కోట్ల రూపాయలు, తెలుగులో 45.50 కోట్ల రూపాయలు, కన్నడలో 8.25 కోట్ల రూపాయలు, తమిళంలో 2.75 కోట్ల రూపాయలు, మలయాళంలో 75 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
మహావతార్ నరసింహా 32వ రోజు కలెక్షన్స్
థియేటర్‌లలో వార్ 2, కూలీ వంటి బడా చిత్రాలు ఉన్నప్పటికీ మహావతార్ నరసింహా మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. 32వ రోజున హిందీలో 9 శాతం, తెలుగులో 12 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. సోమవారం మహావతార్ నరసింహాకు కన్నడంలో 10 లక్షలు, తెలుగులో 50 లక్షలు, హిందీలో కోటి 20 లక్షలు, తమిళంలో 10 లక్షలు చొప్పున 2 కోట్ల రూపాయలు రాబట్టింది. దీంతో 32 రోజుల వరకు ఇండియాలో 276 కోట్ల రూపాయలు గ్రాస్+ ఓవర్సీస్ కలెక్షన్ కలిపి వరల్డ్ వైడ్‌గా 301 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తద్వారా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన తొలి ఇండియన్ యానిమేటెడ్ సినిమాగా నిలిచింది.


Click it and Unblock the Notifications











