Mahavatar Narsimha 50 Days Collections: హిస్టరీ.. మహావతార్ నర్సింహా 50 రోజుల కలెక్షన్స్.. 100ల కోట్ల లాభం?

యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూలై 25న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. కన్నడ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నార్త్ లో దుమ్ములేపింది. ప్రస్తుతం ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా 2 వారాల కంటే ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద మనుగడ సాధించడం లేదు. అలాంది యానిమేటెడ్ ఫిల్మ్ ఏకంగా 50 రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడం హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 50 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసింది? ఎన్ని 100ల కోట్ల లాభం అందుకుందనే వివరాల్లోకి వెళితే..

మహావతార్ నర్సింహా బడ్జెట్? బ్రేక్ ఈవెన్
టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా ఈ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాను నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈమూవీలో నటీనటులు లేకపోవడం గమనార్హం. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ బృందాలే కీలక పాత్రలు పోషించాయి. ఇలా టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రచార కర్చులన్నీ కలుపుకోగా సినిమాకు రూ.15 కోట్లు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక రూ.30 కోట్ల గ్రాస్‌ను బ్రేక్ ఈవెన్ టార్గెట్ నిర్ణయించారు ట్రేడ్ నిపుణులు.

Mahavatar Narsimha Movie Day 50 Box Office Collections Worldwide

రోజు వారీగా 50 రోజుల కలెక్షన్స్?
మహావతార్ నర్సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ వసూళ్లు అందుకుంటోంది. ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు, 20వ రోజు రూ.4.75 కోట్లు, 21వ రోజు రూ.2.6 కోట్లు, 22వ రోజు రూ.7.25 కోట్లు, 23వ రోజు రూ.6.75 కోట్లు, 24వ రోజు రూ.8.15 కోట్లు, 25వ రోజు రూ.2.35 కోట్ల ఇండియా నెట్ వసూలైంది.

26వ రోజు రూ.2.5 కోట్లు, 27వ రోజు రూ.1.75 కోట్లు, 28వ రోజు రూ.1.65 కోట్లు, 29వ రోజు రూ.1.85 కోట్లు, 30వ రోజు రూ.5 కోట్లు, 31వ రోజు రూ.6.15 కోట్లు, 32వ రోజు రూ.1.35 కోట్లు, 33వ రోజు రూ.1.75 కోట్లు, 34వ రోజు రూ.2.25 కోట్లు, 35వ రోజు రూ.1.15 కోట్లు, 36వ రోజు రూ.95 లక్షలు, 37వ రోజు రూ.1.9 కోట్లు, 38వ రోజు రూ.2.65 కోట్లు, 39వ రోజు రూ.55 లక్షలు, 40వ రోజు రూ.75 లక్షలు, 41వ రోజు రూ.60 లక్షలు, 42వ రోజు రూ.80 లక్షలు, 43వ రోజు రూ.44 లక్షలు, 44వ రోజు రూ.57 లక్షలు, 45వ రోజు రూ.90 లక్షలు, 46వ రోజు రూ.22 లక్షలు, 47వ రోజు రూ.23 లక్షలు, 48వ రోజు రూ.18 లక్షలు, 49వ రోజు రూ.16 లక్షలు, 50వ రోజు రూ.11 లక్షలు, 51వ రోజు రూ.22 లక్షలు నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణంకాలు వెల్లడిస్తున్నాయి.

స్టేట్ వైజ్ గా 50 రోజుల వసూళ్లు..
కన్నడలో మహావతార్ నర్సింహా చిత్రం 50 రోజుల్లో రూ.10 కోట్లు, తెలుగులో రూ.49 కోట్లు, హిందీలో రూ.188 కోట్లు, తమిళంలో రూ.3 కోట్లు, మలయాళంలో రూ.50 లక్షలు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
జూలై 24 నుంచి సెప్టెంబర్ 13 వరకు మొత్తం 51 రోజులు అయ్యింది. మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను అందుకుంటూనే వస్తోంది. ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.250 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.297 కోట్లు, ఓవర్సీస్ లో రూ.28 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది. ఈ లెక్కన ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని 51 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.325 కోట్లు వసూళ్లు చేసిందని తెలుపుతున్నారు.

ఎన్ని 100ల కోట్ల లాభం..
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూళ్లు సాధించింది. ఇండియాలో యానిమేటెడ్ ఫిల్మ్స్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రం మహావతార్ నర్సింహా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. పైగా థియేటర్లలో 50 డేస్ ఆడిన యానిమేటెడ్ ఫిల్మ్ గానూ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల లాభాన్ని అందించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X