Mahavatar Narsimha Day 9 Collections : మహావతార్ నర్సింహ ఆల్ టైమ్ రికార్డ్.. 9వ రోజు సెన్సేషనల్ వసూళ్లు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యానిమేషన్ చిత్రం మహావతార్ నర్సింహ. యాక్షన్ యానిమేషన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియా వైడ్ గా, ఓవర్సీస్ లో నార్త్ అమెరికాలో భారీ స్థాయిలో విడుదల అయ్యింది. యానిమేటెడ్ చిత్రమే కదా అనుకున్న అందరికీ షాక్ ఇచ్చేలా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత? 9వ రోజు వరకు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడ చిత్ర పరిశ్రమలోని టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా మహావతార్ నర్సింహా యానిమేటెడ్ చిత్రాన్ని నిర్మించారు. శిల్పా దవన్, కుషల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా వ్యవహరించారు. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించినప్పటికీ.. ఎలాంటి తారాగణం లేకుండా సినిమా నిర్మించారు. దీంతో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ టీమ్ ప్రధాన పాత్రలు పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ డివోషనల్ మ్యూజిక్ తో అదరగొట్టారు. దీంతో టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయాల బడ్జెట్ ఖర్చైందని ట్రేడ్ పండితులు వెల్లడించారు.

మహావతార్ నర్సింహా ప్రీ రిలీజ్ బిజినెస్?
ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ యానిమేటెడ్ చిత్రాలకు మంచి ఆదరణే లభిస్తుంటుంది. అందరూలో మైథాలజీ యానిమేటెడ్ ఫిల్మ్స్ పై మరింత ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో గ్లోబల్ గా విడుదలకు సిద్ధపడిన మహావతార్ నర్సింహా చిత్రానికి నార్త్ అమెరికాలో, ఇండియాలో కలిసి రూ.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక సినిమా లాభాల్లోకి రావాలంటే 30 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వాల్యూ కట్టాయి.
9వ రోజు వరకు బాక్సాఫీస్ వసూళ్లు..
మహావతార్ నర్సింహా చిత్రానికి ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు.. ఇక 9వ రోజు రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల రూపాయల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. 9 రోజుల్లో ఈ చిత్రానికి ఇండియా నెట్ రూ.67.8 కోట్లు వసూళ్లైందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 130 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
230 శాతం రికవరీ.. ఆల్ టైమ్ రికార్డ్..
మహావతార్ నర్సింహా చిత్రం ఇండియాస్ గత యానిమేటెడ్ చిత్రాల బాక్సాఫీస్ లెక్కలను చెరిపేసింది. కేవలం 8 రోజుల్లోనే రూ.60.5 కోట్లు వసూల్ చేసి ఆల్ టైమ్ హ్యాయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ యానిమేటెడ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 230 శాతం రికవరీని సాధించింది. ఇక 30 కోట్ల రూపాయలకు పైగా లాభాలను అందుకుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











