మొత్తానికి అతిథి అర్థ సెంచరీ!
భారీ ఓపెనింగ్స్ తో మొదలయి ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టిన అతిథి సినిమా మొత్తానికి 50 రోజుల హార్డిల్ ను అధిగమించింది. 30 శాతం వసూళ్లతోనే థియేటర్లు ఉసూరుమంటున్నా హైదరాబాద్ నగరంలో మూడు హాళ్లలో నడుస్తోంది. సీమశాస్త్రి పరిస్థితి కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేదు. నితిన్ టక్కరి రెండోవారంలో చతికిలపడింది. 35-40 శాతం మధ్య వసూళ్లతో టక్కరి ఇక్కట్లను ఎదుర్కుంటోంది. ముమైత్ ఖాన్ మైసమ్మ పరిస్థితి మరీ ఘోరం. ఈ సినిమాకు కథే మైనస్ గా చెప్పుకుంటున్నారు. థియేటర్లలో జనాలే కరువవుతున్నారు. సెంచరీవైపు దూసుకెళుతున్న హ్యాపీడేస్ ఒక హైదరాబాద్ నగరంలోనే 12 థియేటర్లలో ఫుల్ కలెక్షన్స్ తో అటు ప్రేక్షకులను, నిర్మాతను అలరిస్తోంది. అర్జున్ సింగమలై తప్ప మరే సినిమా విడుదల కాకపోయినా ఉన్న సినిమాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.


Click it and Unblock the Notifications











