50 సెకన్ల ఆ యాడ్ కోసం మహేష్ బాబు ఎంత తీసుకున్నాడంటే.. షాకింగ్ రెమ్యునరేషన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 150 కోట్ల బిజినెస్ ను క్రియేట్ చేయగలవు. ఇక రానున్న రోజుల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బ్రాండ్స్ ఎండోర్స్ బిజినెస్ లో కూడా మహేష్ బాబు పారితోషకం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల మహేష్ బాబు చేసిన మౌంటెన్ డ్యూ 50 సెకండ్ల యాడ్ కోసం భారీ స్థాయిలో పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహేష్ కోసం ఎగబడుతున్నారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్నటి వరకు కేవలం తెలుగులోనే భారీ స్థాయిలో క్రేజ్ అందుకునే వాడు. కానీ ఇప్పుడు అతని స్మార్ట్ నెస్ కు క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా మహేష్ బాబుతో బ్రాండ్ ప్రమోషన్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. పారితోషికం విషయంలో కూడా కంపెనీలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.

అందుకే మహేష్ తో ఎక్కువ యాడ్స్
చాలా కంపెనీ లో బాలీవుడ్ హీరోలను కాదని మహేష్ బాబు ను సెలెక్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే మహేష్ బాబుకు గత కొంత కాలంగా నార్త్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా మహేష్ బాబు పేరు నేషనల్ వైడ్ గా నిత్యం వైరల్ అవుతుంది. అతను ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో కి చాలా ఈజీగా చేరిపోతుంది. అందుకే చాలా కంపెనీలు అన్ని రకాలుగా ఆలోచించి మహేష్ బాబు ను సెలెక్ట్ చేసుకుంటున్నాయి.

హాలీవుడ్ రేంజ్ లో..
ఇక మహేష్ బాబు ఇటీవల ప్రముఖ పెప్సీ కంపెనీ కి చెందిన మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా పైనుంచి బైక్ స్టంట్ చేసిన యాక్షన్ హీరోగా మహేష్ బాబు కనిపించి అబ్బురపరిచాడు. అయితే ఆ యాడ్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నట్లు ఫ్యాన్స్ పాజిటివ్ గా కామెంట్ చేశారు. మొత్తానికి అభిమానులలో ఆ యాడ్ అయితే మంచి రెస్పాన్స్ అందుకుంది.

గతంలో రెమ్యునరేషన్ ఎంతంటే..
కేవలం 50 సెకండ్ల యాడ్ కోసం మహేష్ బాబు ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నాడు అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. గతంలో అయితే మహేష్ బాబు ఒక యాడ్ కోసం ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల మధ్యలో పారితోషికం అందుకునే వాడు అని కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అయితే మహేష్ బాబు డజనుకు పైగా కంపెనీలకు బ్రాండ్స్ ఎండోర్స్ చేస్తున్నాడు.

50 సెకన్ల కోసం 12 కోట్లు..
ఇక మౌంటెన్ డ్యూ 50 సెకండ్ల యాడ్ కోసం మహేష్ బాబు ఇటీవల దుబాయ్ లో ఒకే ఒక్క రోజు వర్క్ చేశాడు. పూర్తిగా గ్రాఫిక్స్ లో రూపొందిన ఈ యాడ్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపించాడు. అయితే ఈ యాడ్ కోసం ఆ కంపెనీ మహేష్ కు 12 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లో ఇప్పటివరకు యాడ్స్ ద్వారా అందుకున్న అత్యధిక పారితోషికం కూడా ఇదే కావడం విశేషం.. ఇక త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఈ స్టార్ హీరో రేంజ్ ఇంకా ఏ స్థాయిలో పెరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











