twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Brahmotsavam box office: ఆ హీరో రిజెక్ట్ చేసిన సినిమా.. మహేష్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌కు ఐదేళ్లు

    |

    మహేష్ బాబు కెరీర్ మొత్తంలో నిరాశపరిచే సినిమా ఏదైనా ఉందా అని అంటే.. అందరికి బ్రహ్మోత్సవం సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా అర్థం కాదని అభిమానులు ఇప్పటికి కామెంట్ చేస్తుంటారు. ఇక ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేటితో 5 ఏళ్లవుతోంది. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ మొదట ఒక స్టార్ హీరో దగ్గరకు కూడా వెళ్లిందట. ఇక సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    సినిమా డిజాస్టర్ అవ్వడం అంటే..

    సినిమా డిజాస్టర్ అవ్వడం అంటే..

    మహేష్ బాబు ఒక్కడు, మురారి వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం రెగ్యులర్ సినిమాలు కాకుండా కాస్త ప్రయోగాలు కూడా చేయాలని అనుకుంటూ వచ్చాడు. నాని, ఖలేజా డిజాస్టర్ అవ్వడంతో ఆ తరువాత సేఫ్ జోన్ లోనే సినిమాలు చేయాలని మేంటల్ గా ఫిక్స్ అయ్యాడు. సినిమా డిజాస్టర్ అవ్వడం అంటే చాలామంది చాలా రకాలుగా నష్టపోతారు అనే విషయంపైనే మహేష్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు.

    దర్శకుడి నిర్మాత విమర్శలు

    దర్శకుడి నిర్మాత విమర్శలు

    ఎంతో జాగ్రత్తగా ఉండే మహేష్ శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం ఎలా తీశారు అనేది ఆ సినిమా విడుదల అనంతరం ఒక మిస్టరీని క్రియేట్ చేసింది. 2016 మే 20న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి ఐదేళ్లవుతుంది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో నిర్మాత పివిపి ఒక ఇంటర్వ్యూలో దర్శకుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్క్రిప్ట్ చూపించమంటే కూడా చూపించలేదని అన్నారు.

    మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడంటే..

    మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడంటే..

    అసలు ఆ సినిమా ఫుల్ స్క్రిప్ట్ తో వెళ్లలేదట. సింగిల్ లైన్ తో కొన్ని ఎమోషన్స్ సీన్స్ గురించి పాత్రల గురించి చెప్పగానే మహేష్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీకాంత్ అంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తీసిన విధానం మహేష్ బాబుకు బాగా నచ్చింది. అందుకే నమ్మకంతో ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

    మొదట ఆ హీరోతో అనుకుంటే..

    మొదట ఆ హీరోతో అనుకుంటే..

    మహేష్ కంటే ముందు ఈ కాన్సెప్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని అనుకున్నారట. కానీ తారక్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తేనే ఒప్పుకుంటానని అన్నాడట. కానీ శ్రీకాంత్ మాత్రం అలా కాకుండా సినిమా ఎమోషన్స్ తో ట్రావెల్ అవుతూ వెళ్లాలని అనుకున్నాడు. కృష్ణవంశీ మురారి వంటి కథను అలానే తీశాడు. అయితే శ్రీకాంత్ ఊహ పూర్తిగా రివర్స్ అయ్యింది.

    Recommended Video

    SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
    సినిమా మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..?

    సినిమా మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..?

    ఇక బ్రహ్మోత్సవం సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ అందుకుంది. సినిమా దాదాపు 70కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా కేవలం 35కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే దాదాపు మరో 35కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. సినిమా ఆ స్థాయిలో దెబ్బ కొడుతుందని మహేష్ ఊహించలేదు. ఇక ఆ తరువాత మహేష్ తన జీవితంలో ఫుల్ స్క్రిప్ట్ లేకుండా ఏ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని అనుకున్నాడు.

    English summary
    Is there any disappointing movie in Mahesh Babu's career .. Everyone remembers Brahmotsavam movie. Fans are still commenting that it doesn’t make sense no matter how many times you watch that movie. It has been 5 years since the movie came out to the audience. The concept of the movie was first approached by a star hero. If you take a look at the movie collections ..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X