Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబు అత్యదిక రెమ్యునరేషన్.. త్రివిక్రమ్ సినిమాకే ఇంత ఇచ్చారంటే.. ఇక రాజమౌళి మూవీ అంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఎక్కువగా ప్రయోగాలకు వెళ్లకుండా అభిమానులకు కావాల్సిన వినోదాన్ని ఇస్తూ అటు నిర్మాతలను బయ్యర్లకు కూడా సేఫ్ జోన్ లో ఉంచేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్న సినిమా కోసం సూపర్ స్టార్ కెరీర్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే
మహేష్ బాబు కెరీర్ మొదట్లో మురారి, ఒక్కడు వంటి హిట్స్ వచ్చే వరకు కూడా రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ్ చేసింది లేదు. తన మార్కెట్ పరిధిని బట్టి పెంచుకుంటూ వచ్చాడు. ఇక మధ్యలో కొన్ని డిజాస్టర్స్ ఎదురవ్వడంతో వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనే కథలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యాడు.
కథ నచ్చకపోతే..
తన సినిమా కారణంగా అడియెన్స్ నిరాశ చెందకూడదు, అలాగే నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఏ విదంగా నష్టపోకూడదని ఎక్కువగా రిస్క్ చేయడం లేదు. మినిమమ్ హిట్ అనేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే టాలెంటెడ్ దర్శకులతో పిలిచి మరి సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు. కథ నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా ఒప్పుకోవడం లేదు.
త్రివిక్రమ్ సినిమాలో.. అలాంటి రోల్
ఇప్పటికే పూరి జగన్నాథ్ ను రెండు సార్లు రిజెక్ట్ చేయగా త్రివిక్రమ్ ను కూడా ఇంతకుముందు రిజెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు కథ నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. SSMB28 సినిమాలో మహేష్ ఒక 'రా' ఏజెంట్ గా కనిపించనున్నట్లు రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.
వాళ్ళు ఒప్పుకోలేదు
ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు అత్యధిక రెమ్యునరేషన్ అందుకొనున్నట్లు సమాచారం. మహేష్ ఇప్పటివరకు తన ప్రతి సినిమాకు కూడా హోమ్ ప్రొడక్షన్ GMBని మిక్స్ చేస్తూ వాటాలు అందుకుంటూ వచ్చాడు. అయితే ఈసారి త్రివిక్రమ్ - హాసిని హారిక క్రియేషన్స్ కాబట్టి వాళ్లే పాట్నర్స్ గా ఉంటున్నారు. సో మూడో వాటగా మహేష్ ఉండడానికి వాళ్ళు ఒప్పుకోలేదు.
అత్యధిక రెమ్యునరేషన్
అందుకే మహేష్ కు సాలీడ్ రెమ్యునరేషన్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం దాదాపు 50కోట్లకు పైగా పారితోషికం అందుకున్న మహేష్ సర్కారు వారి పాటకు కూడా ఆల్ మోస్ట్ అంతే తీసుకుంటున్నాడట. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం 65 నుంచి 75కోట్లకు మధ్యలో డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
మరి రాజమౌళి సినిమాకు..?
ఇక సూపర్ స్టార్ త్రివిక్రమ్ సినిమా కోసమే ఈ రేంజ్ లో తీసుకుంటున్నాడు అంటే ఆ తరువాత రాజమౌళితో చేయబోయే సినిమాకు ఇంకా ఏ స్థాయిలో తీసుకుంటాడో అనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక ఆ తరువాత మహేష్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని వెంటనే జక్కన్నతో పాన్ ఇండియా ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నాడు.