నాన్ బాహుబలి రికార్డ్‌పై కన్నేసిన సూపర్ స్టార్.. ఆత్రుతగా ఉన్న ఫ్యాన్స్
తెలుగు చిత్ర సీమలో బాహుబలి ఓ సువర్ణాధ్యాయం. టాలీవుడ్ హిస్టరీ రాయాలంటే బాహుబలిని పేర్కొనాల్సిందే. బాహుబలికి ముందు.. తరువాత అని రెండు భాగాలుగా రాయాల్సి వస్తుంది. ఈ చిత్రంతో కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా.. అంతర్జాతీయస్థాయిలో మన ఖ్యాతిని చాటి చెప్పింది. బాహుబలి క్రియేట్ చేసిన రికార్డులను చేరిపేందుకు ఎంత పెద్ద స్టార్ ప్రయత్నించినా ఇప్పటి వరకు కుదరలేదు.

చేరువలోనే ఆగిపోయిన స్టార్ హీరోలు..
బాహుబలి సెట్ చేసిన మార్క్‌ను చేరడం కానీ, దాటడం కానీ కష్టమని భావించిన ట్రేడ్ పండితులు నాన్ బాహుబలి రికార్డులు, నాన్ బాహుబలి ఫీట్ అంటూ కొత్త లెక్కలను గణించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డుల కన్నేశాయని గానీ చెరపలేకపోయాయి.

దూసుకుపోతోన్న మహేష్..
శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా వేటికవే కొత్త రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్లాయి. తెలుగు హీరోల్లో రెండు వందల కోట్లు కొల్లగొట్టే హీరోల్లో మహేష్ ఒకడు. భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో రెండు వందల కోట్ల మార్క్‌ను దాటేశాడు. ఇన్ని రకాలుగా రికార్డులు సృష్టిస్తున్న నాన్ బాహుబలి రికార్డులను బీట్ చేయలేకపోతున్నాడు.

తాజాగా మరో ప్రయత్నం..
బాహుబలి మొదటి రోజు వసూళ్లను దాటేయాలని మహేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోలో రిలీజ్ పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో మహేష్ పాగా వేయనున్నాడు. ఈ కారణంగానే ఫస్ట్ డే కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేసేట్టు తెలుస్తోంది.

దాదాపు 80శాతం..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో దాదాపు 80 శాతం సరిలేరుకు కేటాయించినట్టు తెలుస్తోంది. అన్ని స్క్రీన్స్‌లో రేపు ఒక్కరోజు సరిలేరును ప్రదర్శించబోతోన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాబోతోన్నట్లు తెలుస్తోంది. దాదాపు రేపు ఒక్క రోజే దాదాపు యాభై కోట్ల వరకు కొల్లగొట్టబోతోన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











