Mahesh Babu's Last 5 Movies Collections: మహేష్ గత 5 చిత్రాల కలెక్షన్లు.. గుంటూరు కారం బ్రేక్ చేస్తుందా?
సూపర్‌స్టార్ మహేష్ బాబు గత కొద్ది సంవత్సరాలుగా సక్సెస్‌ఫుల్ హీరోగా బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్నబాబు, నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే భారీగా అడ్వాన్స్ బుకింగ్ సొంతం చేసుకొంటున్నది. ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన గత ఐదు సినిమాల తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, స్పైడర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత మహేష్ బాబు అసలైన ట్రాక్‌లో పడ్డారు. కొరటాల శివతో భరత్ అనే నేను, వంశీ పైడిపల్లితో మహర్షి, అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరూ, పరుశురాంతో సర్కారు వారి పాట సినిమాలతో తన సక్సెస్ జర్నీని కొనసాగిస్తున్నాడు. తాజాగా గుంటూరు కారం సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు నటించిన గత ఐదు సినిమాల తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. స్పైడర్ చిత్రం 16 కోట్ల షేర్ రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత భరత్ అనే నేను 23.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక మహర్షి సినిమా విషయానికి వస్తే.. 24.6 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ 32.7 కోట్లు, సర్కారు వారీ పాట 36 కోట్లు వసూలు చేసింది.
ఇక మహేష్ బాబు నటించిన గత ఐదు సినిమాల వరల్డ్ వైడ్ గ్రాస్, షేర్ వివరాల్లోకి వెళితే.. స్పైడర్ చిత్రం తొలి రోజు 24.5 కోట్లు, 42.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. భరత్ అనే నేను ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 33.9 కోట్ల షేర్, 53.8 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహర్షి చిత్రం 31.8 కోట్ల షేర్, 48 కోట్ల గ్రాస్, సరిలేరు నీకెవ్వరూ 33.58 కోట్ల షేర్, 53 కోట్ల గ్రాస్, ఇక సర్కారు వారి పాట చిత్రం 40.8 కోట్ల షేర్, 63.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇక గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే.. అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో అవుతున్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 65 కోట్లకుపైగా ఫస్ట్ డే గ్రాస్ నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం 42 కోట్లకుపైగా షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 132 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 135 కోట్ల షేర్, 370 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











