బిజినెస్‌తో షాక్ ఇస్తున్న మహేష్.. సర్కారు వారి పాటకు అప్పుడే 57కోట్లా?
సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి సరికొత్త లుక్ తో నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్న. మహేష్ ఆ తరువాత చాలా రకాల కథలు విని చివరకు పరశురామ్ చెప్పిన ఒక డిఫరెంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సర్కారు వారి పాట అనే ఆ సినిమా సరికొత్త ట్రెండ్ సెట్ చేయనుందని సినిమా బిజినెస్ చూస్తేనే అర్ధమవుతోంది.

మహేష్ మైండ్ బ్లాక్ బిజినెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా ఆ తరువాత వచ్చే ప్రాజెక్టుల బిజినెస్ లో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. మినిమమ్ 150కోట్లకు పైగానే బిజినెస్ చేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో టోటల్ బిజినెస్ 200కోట్లకు పైగానే పెరుగుతుందని ప్రస్తుత లెక్కలను చూస్తే అర్ధమవుతోంది. సర్కారు వారి పాట నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా సాలీడ్ గా ఉంది.

షూటింగ్ మొదలు కాకముందే లాభాలు
ఇక షూటింగ్ కూడా మొదలు కాలేదు. అప్పుడే నాన్ థియేట్రికల్ లో భారీగా లాభాలు వస్తున్నాయి అంటే మహేష్ స్టామినా ఏ రేంజ్ లో ఉందొ అర్థం చెసుకోవచ్చు. తెలుగు టీవీ, డిజిటల్ రైట్స్ కి దాదాపు 35కోట్లకు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇక హిందీలో కూడా మహేష్ ప్లాప్ సినిమాలకు కూడా భారీగా రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్ లో అయితే వ్యూవ్స్ భారీగా వస్తున్నాయి.

మొత్తంగా 57కోట్లు
ఇక ఈ సారి తమిళ్ లో మహేష్ సాలీడ్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. తమిళ్ టీవీ, డిజిటల్ హక్కుల రూపంలో 7కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ లో సినిమా 57కోట్లకు పైగా లాభాలను అంధించింది. చూస్తుంటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తోంది. చూడాలి మరి ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో..

ఆ ఇద్దరిలో ఎవరు విలన్?
ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే అమెరికాలో మొదలు కానుంది. బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి సందేశం కుడా ఉంటుందని టాక్. ఇక కీర్తి సురేష్ ఒక బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనుంది. కన్నడ స్టార్ సుదీప్ లేదా ఉపేంద్ర ఇందులో మెయిన్ విలన్ పాత్రలో నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇటీవల సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











