Pokiri 2022 Collections: రీ రిలీజ్ తో మైండ్ బ్లాక్ చేసిన పండుగాడు.. బాక్సాఫీస్ షేక్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో మరోసారి పోకిరి సినిమా రీ రిలీజ్ తో అర్థమయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్ళీ 17 ఏళ్ల తర్వాత మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా అదే తరహా వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం విశేషం. ఇక 2022లో ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు ఏ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

బెస్ట్ మూవీగా

బెస్ట్ మూవీగా

2006లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన పోకిరి సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది అని ఎవరు కూడా ఊహించలేదు. పూరి జగన్నాథ్ కూడా ఆ సినిమా అంతగా సక్సెస్ అవుతుంది అని తాను కలలో కూడా అనుకోలేదు అని అన్నాడు. ఒక విధంగా ఆ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలోనే ఒక బెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలాంటి సినిమా రావాలి

ఇలాంటి సినిమా రావాలి

మహేష్ బాబు స్టార్ హోదా ప్రతి సినిమాకు అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇక పోకిరి సినిమాతోనే అప్పట్లో మొదటిసారి ఒక ఇండస్ట్రీ రికార్డును తిరగ రాసిన మహేష్ బాబు ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమా అయితే చేయలేదు. భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు కానీ ఇలాంటి సినిమా రావాలి అని ఆడియన్స్ చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా రీ రిలీజ్ సక్సెస్ తో మరొక క్లారిటీ అయితే వచ్చేసింది.

భారీగా రీ రిలీజ్

భారీగా రీ రిలీజ్


ఇక మొదట ఒక ఇరవై షోలను మాత్రమే ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ ఈసారి అభిమానుల నుంచి డిమాండ్ ఎక్కువగా రావడంతో ఒక్కడు సినిమాతో పాటు పోకిరి సినిమాను కూడా కాస్త ఎక్కువ సెంటర్లలో విడుదల చేశారు. ముఖ్యంగా పోకిరి సినిమాను దాదాపు 375 షోలను ప్రదర్శించడం విశేషం ఈ షోలకు ఊహించని విధంగా స్పందన వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్

దాదాపు చాలా థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తోనే దర్శనమిచ్చాయి. ఇక 80% మినిమం ఆక్యుపెన్సీ తో కొనసాగిన పోకిరి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలీడ్ కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా నైజాంలో 45 లక్షలు, సీడెడ్ లో 13 లక్షలు, ఉత్తరాంధ్రలో 25 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో 8 లక్షలు, గుంటూరులో 13 లక్షలు, కృష్ణ జిల్లాలో 10 లక్షలు, నెల్లూరులో 4 లక్షలతో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

ఓవర్సీస్ కలెక్షన్స్

ఓవర్సీస్ కలెక్షన్స్

ఇక మిగతా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకు అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మొత్తంగా నాలుగు లక్షలు రాబట్టిన పోకిరి సినిమా ఓవర్సీస్ లో మాత్రం ఊహించిన విధంగా 14 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

టోటల్ కలెక్షన్స్

టోటల్ కలెక్షన్స్

మళ్లీ పోకిరి సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది అని అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. మొత్తంగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 1.48 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ కలెక్షన్స్ మొత్తాన్ని కూడా మహేష్ బాబు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి సహాయంగా అందించబోతున్నారు. థియేటర్ల రెంట్లు మినహాయించి మిగిలిన కలెక్షన్స్ అన్నీ కూడా చిన్నారులకు సంబంధించిన శాస్త్ర చికిత్స కోసం ఖర్చు చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X