Pokiri అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లోయింగ్.. మహేష్ అభిమానుల హవా మామూలుగా లేదు

మహేష్ బాబు సినిమాలలో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం పోకిరి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇక అలాంటి సినిమాను వెండితెరపై మరొకసారి చూస్తే ఆ కిక్కు మాములుగా ఉండదు అని ఇప్పుడు అభిమానులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ ను బట్టి మహేష్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమా ప్రత్యేకమైన షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే..

న్యూ టెక్నాలజీతో కొత్త పోకిరి

న్యూ టెక్నాలజీతో కొత్త పోకిరి

ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఎవరైనా సరే షాక్ కావాల్సిందే. మొదట ఏదో మెయిన్ సెంటర్స్ లలో నాలుగైదు షోలు వేయాలని అనుకున్నారు. కానీ డిమాండ్ ఎక్కువగా రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలోనే ప్రత్యేకమైన షోలు వేయబోతున్నారు. న్యూ టెక్నాలజీ అడ్వాంటేజ్ గా తీసుకుని క్లారిటీ విషయంలో కూడా కొంత మార్పులు చేయబోతున్నారు.

 ఊహించని రేంజ్ లో..

ఊహించని రేంజ్ లో..

ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 థియేటర్లకు పైగా పోకిరి సినిమా విడుదలవుతుండగా తెలంగాణలో 42 షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఇక మిగతా సిటీలలో అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని దాదాపు 30 మూడు షోలు ప్రదర్శించబోతున్నారు. ఇక బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఊహించని రేంజ్ లో నమోదవుతున్నాయి.

 ఓవర్సీస్ లో

ఓవర్సీస్ లో

ఇప్పటికే యూఎస్ఏ లో ప్రత్యేకమైన షోలకు పదివేలకు పైగా డాలర్లు రావడం విశేషం. ఇక దాదాపు 6 షోలకు సంబంధించిన టికెట్లు అన్నీ కూడా అమ్ముడయ్యాయి దాదాపు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 98 శాతానికి పైగా థియేటర్స్ ఆక్యుపెన్సి అందుకున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే బర్త్ డేను స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవటానికి సిద్ధమయ్యారు.

98 శాతం ఫుల్

98 శాతం ఫుల్

గుంటూరులో అయితే 7 షోలకు సంబంధించిన టికెట్లు దాదాపు అన్నీ కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాదులో చూసుకుంటే మొత్తంగా 33 షోలకు ఇప్పటికే 26.2 లక్షల గ్రాస్ దక్కినట్లు సమాచారం. దాదాపు 98 శాతానికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో పోకిరి సినిమా మరోసారి రుజువు చేస్తోంది.
ఎన్నిసార్లు టీవీల్లో వచ్చిన అలాగే యూట్యూబ్లో ఉన్నా కూడా మళ్లీ వెండితెరపై చూడాలి అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.

మహేష్ బాబు మంచి పని కోసం..

మహేష్ బాబు మంచి పని కోసం..

అయితే పోకిరి సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్ లో తీసుకోవడం లేదు. ఈ కలెక్షన్స్ తో ఒక మంచి పని చేయడానికి కూడా వారు సిద్ధమయ్యారు. మహేష్ బాబు తన సొంతంగా ట్రస్టు ద్వారా చిన్నారులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయాలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి ప్రాణదాతగా నిలిచాడు. అయితే ఇప్పుడు పోకిరి సినిమాకు వస్తున్న ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మహేష్ బాబు ట్రస్టుకు అందించబోతున్నారు. కేవలం థియేటర్ రెంట్లు కట్టుకొని డిస్ట్రిబ్యూటర్లందరూ కూడా ఆ డబ్బును అభిమానుల సహకారంతో మహేష్ బాబు సేవా కార్యక్రమాలకు ఉపయోగించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X