Guntur Kaaram: తెలుగు సినీ చరిత్రను తిరగ రాసిన మహేశ్.. ఏకంగా 551 కోట్లతో సంచలన రికార్డు
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్. అంతలా ఈ బడా హీరో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. అదే సమయంలో సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూనే వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే సినిమాలో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ను చేసుకుంది. ఈ నేపథ్యంలో మహేశ్ తాజాగా ఓ సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు. ఆ సంగతులు మీరే చూసేయండి!

గుంటూరు ఘాటు చూపేలా: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రమే 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఫుల్ హైప్.. బిజినెస్ భారీగా: 'గుంటూరు కారం' మూవీపై అంచనాలు భారీ స్థాయాలో నెలకొన్నాయి. దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 102 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, మిగిలిన వెర్షన్లను కలుపుకుని రూ. 132 కోట్లు వ్యాపారం అయింది.

అప్పుడే వంద కోట్ల బిజినెస్: మహేశ్ బాబు కెరీర్‌లో 'స్పైడర్' మూవీ భారీ బిజినెస్‌ను చేసుకుని రికార్డు సాధించింది. కానీ, ఇది డిజాస్టర్ అవడంతో ఆ తర్వాత వచ్చిన 'భరత్ అనే నేను' మూవీపై వరల్డ్ వైడ్‌గా హైప్ భారీ స్థాయిలో ఉన్నా బిజినెస్ అంతగా జరగలేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషలను కలుపుకుని ఈ చిత్రం రూ. 100 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.
మహర్షితోనూ వంద కోట్లతో: 'భరత్ అనే నేను' విజయంతో స్థాయిని పెంచుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశఆడు. దీంతో అప్పుడు అతడు నటించిన 'మహర్షి' సినిమా లెవెల్ కూడా భారీగా పెరిగింది. కానీ, బిజినెస్ మాత్రం అనుకున్న విధంగా జరగలేదు. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 100 కోట్లు వ్యాపారం అయింది.

సరిలేరుకు తగ్గిపోయింది: వరుసగా రెండు సినిమాలతో విజయాన్ని అందుకున్న మహేశ్ బాబు.. ఆ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' అనే మూవీని చేశాడు. కానీ, ఎందుకనో ఈ చిత్రానికి కాస్త డిమాండ్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలను కలుపుకుని రూ. 99.30 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను మాత్రమే చేసుకుని అందరినీ ఆశ్యర్యానికి గురి చేసేసింది.

సర్కారు వారి పాటతో ఊపు: ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందుకున్న మహేశ్ బాబు ఆ తర్వాత 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేశాడు. దీనికి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ఫలితంగా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని సత్తా చాటుకుంది.

551 కోట్లతో మహేశ్ రికార్డు: 'గుంటూరు కారం' మూవీకి రూ. 132 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా రూ. 551.30 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తద్వారా తెలుగు సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక రీజనల్ (ప్రభాస్ పాన్ ఇండియా) హీరోగా మహేశ్ బాబు సంచలన రికార్డును నమోదు చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











