‘ఆగడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉంది?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ తెరకెక్కించిన ‘ఆగడు' గత వారం విడుదలైన సంగతి తెలిసింది. విడుదల ముందు ఉన్న హైప్...విడుదల తర్వాత పూర్తిగా పడి పోయింది. సినిమా బిలో యావరేజ్‌గా ఉండటం అందరినీ అసంతృప్తికి గురి చేసింది.
అయితే మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, మహేష్ బాబు సినిమాలు చూడాలనే ఆసక్తిగా ఉండే ఫ్యామిలీ ప్రేక్షకుల శాతం ఎక్కువే కావడంతో తొలి వారం సినిమా కలెక్షన్లు మెరుగ్గానే ఉన్నాయి. సినిమా విడుదల ముందు ఉన్న హైప్ చూసి ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో 100 కోట్లు సాధించే సినిమా అని అంతా అంచనా వేసారు. అయితే విడుదల తర్వాత రెస్పాన్స్ బట్టి చూస్తే ఈ సినిమా 100 కోట్లు సాధించడం అసాధ్యమని తేలిపోయింది.

అయితే మహేష్ బాబు గత సినిమా ‘1-నేనొక్కడినే' చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్లోతో పోలిస్తే ‘ఆగడు' సినిమా కలెక్షన్లు చాలా మెరుగ్గా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో టాప్ పొజిషన్లో ఉన్న ‘అత్తారింటికి దారేది' రికార్డులు బద్దలు కొట్టడంలో ‘ఆగడు' విఫలమైంది.
సినిమా ఫస్ట్ డే(శుక్రవారం) కలెక్షన్లు సూపర్ అనిపించాయి. అయితే మౌత్ టాక్ బ్యాడ్‌గా రావడంతో శని, ఆదివారాల్లో బిజినెస్ డౌన్ అయింది. వీక్ డేస్ కావడంతో సోమవారం నుండి క్రమ క్రమంగా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. తొలి 7 రోజుల్లో వరల్డ్ వైడ్ ఈచిత్రం దాదాపు 40 నుండి 45 కోట్లు నెట్ వసూలు చేసిందని అంచనా.


Click it and Unblock the Notifications











