‘అత్తారింటికి దారేది’ రికార్డ్ బద్దలు కొట్టిన ‘ఆగడు’

By Bojja Kumar

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆగడు' చిత్రం ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదల సందర్భంగా యూఎస్ఏలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఇక్కడ విడుదలైన ‘1-నేనొక్కడినే', ‘అత్తారింటికి దారేది' చిత్రాల కంటే ఎక్కువ వస్ర్కీన్లలో ‘ఆగడు' చిత్రం విడుదలవుతోంది. పలువురు బాలీవుడ్ స్టార్ల సినిమాల కంటే కూడా ‘ఆగడు' చిత్రం విడుదల గ్రాండ్‌గా ఉండటం విశేషం.

గతంలో ‘1-నేనొక్కడినే' చిత్రం 105 స్క్రీన్లలో విడుదలైంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం 120 స్క్రీన్లలో విడుదలైంది. ఈ రెండు సినిమాల విడుదల రికార్డులను బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ ‘రభస' చిత్రం 125 స్క్రీన్లలో విడుదలైంది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ తెలుగు రిలీజ్.

Mahesh Babu's Aagadu Breaks 1: Nenokkadine, Attarintiki Daredi Records

తాజాగా...ఆగడు చిత్రం పై సినిమాల రికార్డలను బద్దలు చేస్తూ ఏకంగా 150కి పైగా స్క్రీన్లలో విడుదలవుతోంది. ఇప్పటికే నిర్మాతలు 150 స్క్రీన్లకు సంబంధించిన లిస్టు విడుదల చేసారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ల అమ్మకం కూడా జరిగిపోయింది. ‘తొలి సారి అమెరికాలో ఓ తెలుగు సినిమా 150కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది' అంటూ నిర్మాతలు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ట్విట్టర్లో స్పందిస్తూ...‘యూఎస్ ప్రింట్లు సబ్ టైటిల్స్‌తో విడుదలవుతోంది. డల్లాస్‌లో రెండు ప్రీమియర్ షోలకు సంబంధించి టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మూడో షో కూడా యాడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఆగడ్...అన్ స్టాపబుల్' అంటూ ట్వీట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X