మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. రామ్ చరణ్‌ని దాటేసి..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో రూపొందిన సినిమా మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ 20 రోజుల జర్నీ పూర్తిచేసుకుంది. ఇప్పటి వరకు క్రియేట్ అయిన నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ మహేష్ కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా దూసుకుపోతోంది మహర్షి. హై టెక్నీకల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ చిత్రంలోని కథాంశం, నటీనటుల అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మూడు డిఫరెంట్ షేడ్స్ లో మహేష్ బాబు నటన భారీ ప్రశంసలు అందుకుంది.

ఇక రికార్డుల పరంగా చూస్తే.. మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ తెచ్చుకున్న మహర్షి ఓవరాల్ గా మాత్రం భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సూపర్ హిట్ సినిమాగా దూసుకుపోతూ.. మహేష్ గత సినిమాల కంటే హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టి మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తోంది. ఇక నైజాం కలెక్షన్స్ పరంగా మహేష్ మరోసారి తన స్టామినా చూపించాడు. దిల్ రాజు 22 కోట్లకు మహర్షి రైట్స్ కొనుగోలు చేయగా.. కేవలం 19 రొజుల్లో 28 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఆయనకు లాభాల పంట పండించింది. అంతేకాదు గతంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం రికార్డును అధిగమించింది మహర్షి.

Mahesh Babus Maharshi crossed Rangasthalam record

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా నైజాం టోటల్ రన్‌లో 27.70 కోట్ల కలక్షన్స రాబట్టింది. దీంతో ఆ రికార్డును తిరగ రాస్తూ మహర్షి సినిమా తన పేరును లిఖించుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే 175 కోట్ల గ్రాస్ పై చిలుకు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా త్వరలోనే 200 క్లబ్‌లో చేరనుందని తెలుస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ సంయుక్త సమర్పణలో రూపొందిన మహర్షి చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనికి 'రెడ్డి గారి అబ్బాయి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X