twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్రిక్ కొట్టిన మహేష్‌బాబు... రికార్డుస్థాయిలో మహర్షి ప్రీరిలీజ్ బిజినెస్

    |

    భరత్ అనే నేను సినిమా సక్సెస్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం మహర్షి. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీవీ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. ఈ సినిమా గురించి ఇటీవల దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా తెరపై అద్భుతంగా మే 9న ఆవిష్కరించడం ఖాయం అని వెల్లడించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే...

    రూ.70 కోట్ల వ్యయంతో

    రూ.70 కోట్ల వ్యయంతో

    పూజా హెగ్డే, అల్లరి నరేష్ లాంటి క్రేజీ యాక్టర్లతో మహర్షి చిత్రాన్ని సుమారు రూ.70 కోట్ల వ్యయంతో 150 రోజుల్లో తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచింది. ఈ క్రమంలో ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్. టాలీవుడ్ రేంజ్ పెరిగిందనడానికి ఇది ఉదాహరణ అని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

    మూడోసారి రూ.100 కోట్ల బిజినెస్

    మూడోసారి రూ.100 కోట్ల బిజినెస్

    మహేష్ బాబు సినిమా 100 కోట్ల రూపాయలకుపైగా బిజినెస్ చేయడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు అమ్మడం జరిగిందనేది ట్రేడ్ రిపోర్టు. శాటిలైట్ హక్కులను భారీ ధర చెల్లించి జెమినీ టెలివిజన్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇలా వంద కోట్ల బిజినెస్ చేయడం ఇది మూడోసారి. ప్రిన్స్ గత చిత్రం భరత్ అనే నేను రూ.102 కోట్ల బిజినెస్ చేయడం గమనార్హం.

     ఫ్యాన్సీ రేటుకు ఏపీ, తెలంగాణ హక్కులు

    ఫ్యాన్సీ రేటుకు ఏపీ, తెలంగాణ హక్కులు

    ఏపీ, తెలంగాణకు సంబంధించిన హక్కులు కూడా భారీ రేటుకు అమ్మడం జరిగిందని చెప్పుకొంటున్నారు. ఇక నైజాం ఏరియా హక్కులను 18 కోట్లకు, సీడెడ్ హక్కులను 15 కోట్లకు అమ్మడం జరిగిందని వెల్లడిస్తున్నారు. భరత్ అనే నేను సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయనేది టాక్.

    రికార్డు ధరకు ఓవర్సీస్ హక్కులు

    రికార్డు ధరకు ఓవర్సీస్ హక్కులు

    మహర్షి ఓవర్సీస్ రైట్స్ అమ్మకం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను రూ.12 కోట్లు చెల్లించి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకొన్నట్టు సమాచారం. ఇధి మహేష్ కెరీర్‌లో ఓ ల్యాండ్ మార్క్ బిజినెస్ అని చెప్పుకొంటున్నారు.

    English summary
    Superstar Mahesh Babu and director Vamshi Paidipally’ Maharshi movie pre release business at record price. satellite rights sold for a record price to Gemini. Now overseas rights sold for 12 crores. Reporst suggest that Overal business above Rs.100 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X