'సరిలేరు నీకెవ్వరు' 18 డేస్ రిపోర్ట్.. నేటికీ అదే హవా!!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొంది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నేటికీ సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ఎక్కడా తడబడకుండా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే 18 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏ మేర వసూళ్లు రాబట్టిందో ఓ లుక్కేద్దామా..

18వ రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా
రెండు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీక్ లోకి వచ్చాక సరిలేరు నీకెవ్వరు సినిమా కలెక్షన్స్ కొంచెం స్లో అయినట్లు కనిపించాయి.. కానీ, వీకెండ్ వచ్చేసరికి మళ్ళీ పుంజుకొని అదే హవా కొనసాగిస్తున్నాయి. 18వ రోజు సరిలేరు నీకెవ్వరు సినిమా 1.29 కోట్లు రాబట్టింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మహేష్ బాబు మేనియా కనిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్
విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ దాడి ప్రారంభించిన మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రికార్డులు తిరగరాశారు. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సినిమాను ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా నిలిపారు. ఈ 18 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 111.51 కోట్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 132.57 కోట్లు కొల్లగొట్టింది.

సరిలేరు నీకెవ్వరు 18 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏరియావైజ్
నైజాం : 37.38 కోట్లు
సీడెడ్ : 15.06 కోట్లు
గుంటూరు : 9.58 కోట్లు
ఉత్తరాంధ్ర : 18.91 కోట్లు
తూర్పు గోదావరి : 10.94 కోట్లు
పశ్చిమ గోదావరి : 7.20 కోట్లు
కృష్ణ : 8.56 కోట్లు
నెల్లూరు : 3.96 కోట్లు
మొత్తం షేర్ : 111.51 కోట్లు

ఇక సరిలేరు నీకెవ్వరు 18వ రోజు వసూళ్లు చూస్తే..
నైజాం : 26 లక్షలు
సీడెడ్ : 7 లక్షలు
గుంటూరు : 3 లక్షలు
ఉత్తరాంధ్ర : 14 లక్షలు
తూర్పు గోదావరి : 4 లక్షలు
పశ్చిమ గోదావరి : 3 లక్షలు
కృష్ణ : 3 లక్షలు
నెల్లూరు : 2 లక్షలు
మొత్తం షేర్ : 0.62 కోట్లు
Recommended Video

మహేష్ కేరీర్ లోనే సరికొత్త రికార్డు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న నటించింది. విజయశాంతి కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మొత్తానికైతే ఈ సినిమా ఇప్పటికే కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











