మహేష్ బాబూ 'సరిలేరు నీకెవ్వరూ'...2020లో టాప్, టాలీవుడ్ నుంచీ ఏకైక సినిమా అదే !
అభిమానులు ముద్దుగా ప్రిన్స్ అని పిలుచుకునే మహేష్ బాబుకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయగానే దానికి విపరీతమైన రెస్పాన్స్ కూడా లభిస్తుంది. అయితే ముఖ్యంగా ట్విట్టర్ విషయంలో అయితే ఆయన ఎప్పటికప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. సినిమాల విషయంలో కూడా ఆయన అనేక రికార్డులు బద్దలు కొడుతూ ఉంటారు.
తాజాగా ఆయన సరిలేరు నీకెవ్వరు సినిమా మరో రికార్డు బద్దలు కొట్టింది. #SarileruNeekevvaru సినిమా 2020లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన 41 వ చిత్రంగా నిలిచింది. అలాగే దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఏకైక చిత్రంగా కూడా నిలిచింది. ఇక తెలుగు నుంచి కూడా ఈ సినిమా ఆ 50 సినిమాల లిస్టులో ఏకైక సినిమాగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 278 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. మహేష్ బాబు సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ శాంతి, సంగీత లాంటి సీనియర్ నటీమణులు కూడా కీలక పాత్రలలో నటించారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక దీంతో సంక్రాంతి మొగుడు, బాక్సాఫీస్ అమ్మ మొగుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంటపురంలో సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు పోటాపోటీగా ఆడాయి. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వలన వాయిదా పడి ఈ మధ్యనే సినిమా మొదలయింది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి సినిమాలు లైన్ లో పెట్టారు. ఆయన మరి కొంత మంది దర్శకుల కధలు వింటున్నారని ప్రచారం జరుగుతున్నా ఇంకా అధికారిక ప్రకటనలు లాంటివి అయితే ఏమీ వెలువడలేదు.


Click it and Unblock the Notifications











