SVP మేనియా.. దుమ్ము రేపుతున్న బుకింగ్స్.. హైదరాబాద్ లో నాన్ RRR రికార్డు సెట్ చేసేసిందిగా!
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమైంది. మరి కొద్ది గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతానికి తెలుగు భాషలో మాత్రమే విడుదల అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండటంతో టికెట్ సేల్స్ కూడా భారీగా నమోదవుతున్నాయి. అంతేకాక ఈ సినిమా హైదరాబాద్లో నాన్ RRR రికార్డ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఆలస్యం అవుతూ
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన వంశీ పైడిపల్లితో సినిమా చేయవచ్చని అంచనాలు వెలువడ్డాయి. కానీ గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా ప్రకటన అయితే వచ్చింది కానీ తర్వాత సినిమా అయితే ఆలస్యం అవుతూ వచ్చింది.

మే 12వ తేదీన
సినిమా పూర్తయింది అనుకొని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ విడుదల చేయలేక పోయారు. అలాగే మరో డేట్ కూడా ప్రకటించారు కూడా, అప్పుడు కూడా సినిమా విడుదల అవ్వలేదు. అలా అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ఎట్టకేలకు మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

సూపర్ చార్ట్ బస్టర్స్
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, సముద్రకని కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా వెన్నెల కిషోర్ ఒక అద్భుతమైన పాత్రలో నటించారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. తమన్ సంగీతం అందించిన అన్ని సాంగ్స్ కూడా సూపర్ చార్ట్ బస్టర్స్ అయి తెలుగు ప్రేక్షకులు అందరి నోళ్లలో నానుతున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇదిలా ఉండగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మహేష్ బాబు కు చెందిన జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా మీద ఏర్పడిన భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. మహేష్ కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా ఈ సినిమా నిలబడింది.

భారీగా అడ్వాన్స్ బుకింగ్స్
తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమా మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏడు కోట్ల 20 లక్షల రూపాయల మేర వసూళ్ల వచ్చాయి అని అంటున్నారు.

నాన్ RRR రికార్డ్
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో RRR సినిమా 10 కోట్ల 50 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా సర్కారు వారి పాట ఏడు కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో ఉంది. భీమ్లా నాయక్ సినిమా ఆరు కోట్ల 17 లక్షలతో మూడో స్థానంలో ఉంది. , 6.16 కోట్లతో రాధే శ్యామ్, 5.89 కోట్లతో పుష్ప: ది రైజ్, 6.2 కోట్లతో KGF చాప్టర్ 2 మరియు 4.9 కోట్లతో ఆచార్య తరువాతి స్థానాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











