Sarkaru Vaari Paata day 1 collections ట్రోల్స్, దారుణమైన టాక్‌తో.. మహేష్ కెరీర్‌లోనే షాకింగ్‌గా కలెక్షన్లు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారీ పాట చిత్రం సగటు ప్రేక్షకులు, సినీ విమర్శకులను మెప్పించలేకపోయింది. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. అయితే ఏపీలో తుఫాన్ ప్రభావం, నైజాంలో ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ ఓ మోస్తారుగా సాగడంతో సర్కారు వారీ పాట తొలి రోజు కలెక్షన్లు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

 హైదరాబాద్‌లో తొలి రోజు

హైదరాబాద్‌లో తొలి రోజు


సర్కారు వారీ పాట సినిమాకు హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. రిలీజ్ రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ సినిమా 8.18 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక తొలి రోజున ఈ చిత్రం 42 లక్షల వసూళ్లను రాబట్టింది. అయితే గతంలో తొలి రోజున పుష్ప చిత్రం 41 లక్షలకుపైగా, భీమ్లా నాయక్ 38 లక్షలు, ఆచార్య 37 లక్షలకుపైగా, రాధేశ్యామ్ 35 లక్షలు, వకీల్ సాబ్ 34 లక్షలు వసూలు చేశాయి. RRR చిత్రం 60 లక్షల వరకు రాబట్టింది. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో ఫస్ట్ డే కలెక్షన్లు

అమెరికాలో ఫస్ట్ డే కలెక్షన్లు


అమెరికాలో ప్రీమియర్లు, అడ్వాన్సు బుకింగ్ ద్వారా సర్కారు వారీ పాట చిత్రం 900k డాలర్లను నమోదు చేసింది. అలాగే తొలి రోజు కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంటే భారతీయ కలెక్షన్లలో ఈ చిత్రం 7 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహేష్ బాబు కెరీర్‌లో ఒక మిలియన్ డాలర్లు రాబట్టడం ఇది 11వ సారి కావడం విశేషంగా మారింది.

బెంగళూరు, చెన్నైలో

బెంగళూరు, చెన్నైలో


ఇక బెంగళూరు, చెన్నైలో సర్కారు వారీ పాటకు అంతగా స్పందన కనిపించలేదు. బెంగళూరులో 200కుపైగా షోలు ప్రదర్శించారు. సుమారు 50 శాతం అక్యుపెన్సీతో ఈ చిత్రం తొలి రోజున 81 లక్షల వసూళ్లను రాబట్టింది. గతంలో 154 షోల ద్వారా భీమ్లా నాయక్ 75 లక్షల షేర్, 1.13 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. చెన్నైలో సుమారు 35 లక్షల షేర్ నమోదు చేసినట్టు సమాచారం.

 నైజాంలో ప్రతికూలంగా

నైజాంలో ప్రతికూలంగా


నైజాంలో మహేష్ బాబుకు కలెక్షన్ల అడ్డగా ఉండేది. సర్కారు వారీ పాట సినిమా విషయంలో కొంత ప్రతికూలత కనిపిస్తున్నది. మహేష్ బాబుకు నైజాంలో ఈ సినిమా విషయంలో కొంత ఎదురుదెబ్బే తగిలింది. తొలి రోజున సర్కారు వారీ పాట చిత్రం 20 కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అధికారిక వసూళ్ల వివరాలు శనివారం ఉదయం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా


తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారీ పాట చిత్రం ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే రాబట్టే అవకాశం ఉంది. తుఫాన్ పరిస్థితుల వల్ల తక్కువ అక్యుపెన్సీ ఆంధ్రా సీడెడ్‌లో నమోదైంది. ఫస్ట్, సెకండ్ షోలకు మెరుగైన అక్యుపెన్సీ ఉంటే.. మెరుగైన కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 25 కోట్ల రాబట్టే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా

దేశవ్యాప్తంగా కలెక్షన్లు ఇలా


ఇక ఇండియా వ్యాప్తంగా సర్కారు వారీ పాట సినిమా కలెక్షన్లు సగటు గణాంకాలే నమోదు అయ్యాయి. 60 శాతం అక్యుపెన్సీతో ట్రేడ్ వర్గాలను నిరాశ గురిచేశాయి. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 4431 షోలు ప్రదర్శించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో కోటికిపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 32 నుంచి 35 కోట్ల మధ్య వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

లాభాల్లోకి రావాలంటే ఎంతంటే?

లాభాల్లోకి రావాలంటే ఎంతంటే?


ఇదిలా ఉండగా, సర్కారు వారీ పాట చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం 130 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 135 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా సంపాదించుకొన్న టాక్‌తో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X