Sarkaru Vaari Paata day 5 collections నైజాంలో భారీ దెబ్బ.. ఆంధ్రాలో పరిస్థితి ఏమిటంటే.. లాభాల్లోకి రావాలంటే?

సర్కారు వారి పాట చిత్రం నెగిటివ్ టాక్‌ను ఎదురిస్తూ వారాంతంలో భారీ వసూళ్లను నమోదు చేసింది. అన్ని సినిమాలకు అగ్ని పరీక్షగా మారే సోమవారం రోజున పలు ప్రాంతాల్లో అడ్వాన్సు బుకింగ్స్ సగానికి సగం పడిపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ 5వ రోజున కలెక్షన్ల అంచనా ఈ విధంగా ఉందంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

తొలి రెండు రోజుల్లో

తొలి రెండు రోజుల్లో


సర్కారు వారీ పాట తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లను సాధించింది. అయితే శని, ఆదివారం లాంటి సెలవు దినాల్లో సర్కారు వారి పాట గణనీయంగా కలెక్షన్లను పెంచుకోలేకపోయింది. క్రమేపీ రోజు రోజుకు ఈ సినిమా వసూళ్లు క్షీణిస్తు వచ్చాయి. ఐదో రోజున వర్కింగ్ డే కావడంతో యావరేజ్‌గా తెలుగు రాష్ట్రాల్లో 40 శాతానికిపైగా డ్రాప్స్ ఉన్నట్టు సమాచారం.

నాలుగు రోజుల్లో సర్కారు వారీ పాట

నాలుగు రోజుల్లో సర్కారు వారీ పాట


గత నాలుగు రోజుల్లో మహేష్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. నైజాంలో ఈ చిత్రం 29.61 కోట్ల షేర్, సీడెడ్‌లో 9.81 కోట్ల షేర్, ఉత్తరాంధ్రలో 9.36 కోట్ల షేర్, గుంటూరులో 7.57 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 6.51 కోట్ల షేర్, కృష్ణా జిల్లాలో 5.4 కోట్ల షేర్, నెల్లూరు జిల్లాలో 2.91 కోట్ల షేర్ సాధించింది. ఏపీ, నైజాంలో 75.58 కోట్ల షేర్, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 7.6 కోట్లు, ఓవర్సీస్‌లో 11.9 కోట్ల షేర్‌తో ప్రపంచవ్యాప్తంగా 95.08 కోట్ల షేర్‌ను రాబట్టింది.

నైజాం, సీడెడ్‌లో దారుణంగా

నైజాం, సీడెడ్‌లో దారుణంగా

సర్కారు వారీ పాట ఐదో రోజున నైజాంలో వసూళ్లు భారీగా క్షీణించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక సీడెడ్‌లో కూడా డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఆంధ్రాలో వసూళ్లు ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి అని ట్రేడ్ వర్గాలు, డిస్టిబ్యూటర్ వర్గాలు వెల్లడించాయి.
దేశవ్యాప్తంగా 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్

దేశవ్యాప్తంగా 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్


సర్కారు వారీ వర్కింగ్ డే అయిన 5వ రోజున ఓ మోస్తారు వసూళ్లను నమోదు చేసిందనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు 2.80 కోట్లుగా నమోదయ్యాయి. తొలి రోజున 19.80 కోట్లు, రెండో రోజున 8.60 కోట్లు, మూడో రోజున 9.25 కోట్లు, నాలుగో రోజున 8.45 కోట్లు నమోదు చేసింది.

5వ రోజున కలెక్షన్ల అంచనా

5వ రోజున కలెక్షన్ల అంచనా


సర్కారు వారి పాట సినిమా సెకండ్ షో తర్వాత అందిన రిపోర్టు ప్రకారం.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల మేర షేర్ నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి మొత్తంగా ఈ చిత్రం 5.5 కోట్ల షేర్‌ను సాధించే అవకాశం ఉందని లెక్క కట్టారు.

సర్కారు వారీ పాట లాభాల్లోకి రావాలంటే..

సర్కారు వారీ పాట లాభాల్లోకి రావాలంటే..


సర్కారు వారీ పాట ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 120 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 95 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 25 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఒకవేళ 25 కోట్లు వసూలు చేస్తే హిట్ టాక్‌ను మహేష్ బాబు ఖాతాలో వేసుకొంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X