Sarkaru Vaari Paata షాకింగ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్.. మహేష్ బాబు ముందు భారీ టార్గెట్
సరిలేరు నీకెవ్వరు చిత్రం లాంటి భారీ విజయం తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారీ పాట చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది. ఈ చిత్రంపై ఇప్పటికే ఓ మోస్తారు అంచనాలు పెరిగాయి. అయితే ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సర్కారు వారీ పాట ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిన తీరు, ఈ సినిమా ముందు ఉన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్‌పై సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

సర్కారు వారీ పాటపై ఫ్యాన్స్ ఆగ్రహం
సర్కారు వారీ పాట సినిమా ప్రమోషన్స్ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. సూపర్ స్టార్ సినిమాకు తగినట్టుగా క్రేజ్, బజ్ లేకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రమోషన్స్ సరిగా లేవని, సినిమా అప్‌డేట్స్ ఇవ్వడం లేదని స్వయంగా అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో నిర్మాతలపై, టీమ్‌పై నెగిటివ్ ట్రెండ్ చేశారు.

ఊహించని రేంజ్‌లో బిజినెస్
సర్కారు వారీ పాట సినిమాపై ఇటీవల జరుగుతున్న పరిణామాలు పక్కన పెడితే.. ఊహించని రేంజ్‌లో మూవీ బిజినెస్ జరిగింది. అయితే భారీగా బిజినెస్ చేయడంతో ఈ ప్రాంతీయ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే విషయం చర్చనీయాంశమవుతున్నది

ఆంధ్రా, నైజాంలో ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక సర్కారు వారీ పాట సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాంలో భారీగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. ఏపీలో 60 కోట్ల మేర బిజినెస్ జరిగితే.. నైజాంలో 40 కోట్లకుపైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఈ చిత్రం సుమారు 103 కోట్ల బిజినెస్‌ను నమోదు చేసినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 105 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన అవసరం ఏర్పడింది.

దక్షిణాది రాష్ట్రాల్లో ట్రేడ్ రిపోర్ట్
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా భారీగా బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 15 కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, కేరళలో 5 కోట్ల బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలతో కలిపి 133 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం.

ఓవర్సీస్‌లో బిజినెస్ ఇలా..
ఇక దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీగానే బిజినెస్ చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ 5 కోట్లుగా నమోదైంది. ఇక ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 33 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ చిత్రం 38 కోట్ల టార్గెట్ ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో సెట్ చేసింది. మొత్తంగా సర్కారు వారీ పాట 175 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం.

మహేశ్ బాబు మూవీకి సాధ్యమేనా?
సర్కారు వారీ పాట డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే మహేష్ బాబు మూవీ ముందు 180 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉందనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంటే తప్ప.. ఈ భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమే అంటున్నారు. ఒకవేళ ఏబో యావరేజ్ టాక్ సొంతం చేసుకొంటే మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడాల్సిందే అనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











