twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైడర్ కలెక్షన్ల పంట.. యూఎస్‌లో తొలిరోజున బాహుబలి2 రికార్డు బ్రేక్..

    By Rajababu
    |

    Recommended Video

    స్పైడర్ కలెక్షన్ల పంట..బాహుబలి 2 రికార్డు బ్రేక్ Spyder beat Baahubali 2 record

    ప్రిన్స్ మహేశ్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ చిత్రం మోత మోగిస్తున్నది. రిలీజ్ అయిన తొలిరోజునే టాక్‌తో సంబంధం లేకుండా స్పైడర్ చిత్రం వసూళ్ల దూకుడు ప్రదర్శిస్తున్నది. స్వదేశంలో కంటే అమెరికాలో స్పైడర్ చిత్రం ఓ రోజు అంటే మంగళవారం (26న) విడుదలైన సంగతి తెలిసిందే. యూఎస్ బాక్సీఫీస్ వద్ద కలెక్షన్ల రిపోర్ట్ ఈ విధంగా ఉంది.

    తొలిరోజునే ఒక మిలియన్

    తొలిరోజునే ఒక మిలియన్

    ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాలో స్పైడర్ చిత్రం తొలి రోజున ఒక మిలియన్ డాలర్ల మార్కు (6.5 కోట్లు)ను సునాయాసంగా దాటింది. ఓవర్సీస్ మార్కెట్లో ఓ భారతీయ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం ఆశ్చర్యం అని కథనంలో పేర్కొన్నది. గతంలో అమీర్ ఖాన్ నటించిన దంగల్, బాహుబలి2 చిత్రాలు మాత్రమే 2 మిలియన్ల డాలర్లను వసూలు చేశాయి.

    300 స్క్రీన్లలో హల్‌చల్

    300 స్క్రీన్లలో హల్‌చల్

    అమెరికాలో స్పైడర్ దాదాపు 300 స్క్రీన్లలో విడుదల కావడం మహేశ్ బాబు కెరీర్‌లోనే ఓ రికార్డు. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ చిత్రం 6 లక్షల డాలర్లను రాబట్టింది. మహేశ్ బాబు క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్ర టికెట్ ధరను 25 డాలర్లుగా నిర్ణయించారు. మంగళవారం నాటి వసూళ్ల పరంగా చూస్తే బాహుబలి2 రికార్డులను స్పైడర్ తిరుగరాసింది.

    భారీ కలెక్షన్లకు అవకాశం..

    భారీ కలెక్షన్లకు అవకాశం..

    దసరా పండుగ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ కావడం స్పైడర్‌‌కు కలిసి వచ్చే అంశం. తొలి వారాంతానికి ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళ, ఇతర రాష్ట్రాల్లో విడుదలైన స్పైడర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. అక్యుపెన్సీ రేషియో కూడా గణనీయంగా ఉండటం శుభపరిణామం.

    తొలివారాంతానికి 12 మిలియన్లు

    తొలివారాంతానికి 12 మిలియన్లు

    తొలివారాంతానికి స్పైడర్ చిత్రం దాదాపు 12 మిలియన్ డాలర్లను వసూలు చేసే అవకాశం ఉందని ఫోర్బ్స్ అంచనా వేస్తున్నది. గతంలో మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్ర రికార్డులను స్పైడర్ తిరగరాస్తే అవకాశం ఉంది అని ఫోర్స్ అభిప్రాయపడింది.

    ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా..

    ఫస్ట్ డే కలెక్షన్లు ఇలా..

    ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ చిత్రం తొలి రోజున సుమారు 40 కోట్లు (షేర్), 65 కోట్లు (గ్రాస్) వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సుమారు 25 కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. తమిళ, కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించవచ్చు అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

    English summary
    Mahesh Babu’s latest movie SPYder is all set for a bumper opening. SPYder could gross $1 million on its opening day, that comes to around Rs 6.5 crore. The report mentions that such collections is unprecedented for an Indian movie, though Aamir Khan’s Dangal and Prabhas’s Baahubali 2 had managed to do so earlier. The movie will have a nearly $12 million opening weekend
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X