Mahesh Babu: సర్కారు వారి పాట కోత మొదలైంది.. విడుదలైన కొన్ని గంటల్లోనే నాన్ RRR రికార్డ్ బ్రేక్!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా రోజుల తర్వాత మళ్లీ మరొక పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చింది. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. అయితే ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో సందడి మొదలు పెట్టింది.

Recommended Video

Sarkaru Vaari Paata Public Talk In Bangalore మూవీ బాగుంది కానీ ... | Filmibeat Telugu

ఇక అనుకున్నట్లే రికార్డు దిశగా కలెక్షన్స్ అందుకోవడం స్టార్ట్ చేసింది. ఓవర్సీస్ లో తెలుగు రీజినల్ మూవీస్ లలో సినిమా నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్ స్థానే సరికొత్త షాక్ ఇచ్చిన సర్కారు వారి పాట ఇక ప్రీమియర్ షోలో కలెక్షన్లతో కూడా ఎవరూ ఊహించని రికార్డును సొంతం చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే...

టాప్ హీరోగా మహేష్ బాబు

టాప్ హీరోగా మహేష్ బాబు

సాధారణంగా మహేష్ బాబు నుంచి ఎలాంటి సినిమా విడుదల అయినా కూడా ఓవర్సీస్లో ఒక మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఆయన ప్రతి సినిమా కూడా అమెరికాలో భారీ స్థాయిలో విడుదల అవుతూ ఉంటాయి. టాలీవుడ్ నుంచి ఓవర్సీస్ లో అత్యధిక మార్కెట్ అన్న హీరో మహేష్ బాబు అనే చెప్పాలి. మహేష్ బాబు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అమెరికాలో అయితే భారీ స్థాయిలో వసూళ్లను అందుకోవడం ఆనవాయితీగా మారింది.

అన్ని రకాలుగా..

అన్ని రకాలుగా..

ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే తరహాలో ఓపెనింగ్స్ అందుకునే దిశగా వెళుతోంది. పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు మొదటి సారి నటించడం ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ ఐతే క్రియేట్ అయింది. దానికి తోడు కీర్తి సురేష్ కూడా మొదటిసారి నటించడం ఓ వర్గం వారికి ఎంతగా నచ్చేసింది. ఇక అన్ని రకాలుగా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

ఓవర్సీస్ లో..

ఓవర్సీస్ లో..

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరి లో కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. తప్పకుండా మొదటిరోజే మహేష్ బాబు సినీ జీవితంలోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని హడావుడి చూస్తేనే అర్థమవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా సరికొత్త రికార్డులను అందుకునే దిశగా వెళుతున్నట్లు కనిపిస్తోంది.

RRR నాన్ రికార్డ్

RRR నాన్ రికార్డ్

ఫైనల్ గా సర్కారు వారి పాట సినిమా యూఎస్ లో $861K ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేసే విధంగా కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ లెక్క ఈజీగా 950K రేంజ్ లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి ఇది నాన్ RRR రికార్డ్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. గతంలో కంటే మహేష్ బాబు సినిమా అత్యధిక దాలర్లను అందుకోవడం విశేషం. ఇంకా సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఆ లెక్క ఆ రేంజ్ కు వెళుతుందో చూడాలి.

భారీ టార్గెట్..?

భారీ టార్గెట్..?

ఇక సర్కారు వారి పాట సినిమా తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా నెవర్ బిఫోర్ అనేలా భారీస్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 124 కోట్లకు పైగా బిజినెస్ అయితే చేసింది. మొదటి రోజే ఈ సినిమా భారీ స్థాయిలో షేర్ అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మహేష్ బాబు ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X